అంబటికి ఈడీ విచిత్ర నోటీసు..! 11న రమ్మని..! అంబటి రాయుడు పేరు రాయించి..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని ఆరోపిస్తున్న మద్యం స్కాం కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు (Ambati Rambabu ) ఇవాళ ఈడీ షాకిచ్చింది. విచిత్రంగా ఈ కేసులో ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై అంబటి స్పందించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తెగబడుతోందని, ఇందులో భాగంగానే తనను లక్ష్యంగా చేసుకుని ఈడీ నోటీసులు పంపారన్నారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్కుట్రపూరితంగా వ్యవహరిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభావితం చేస్తున్నారని అంబటి ఆరోపించారు.

FBIని కూడా వాడేస్తారా ? ఏపీ పరువుతీశారు..! జగన్ ఫైర్..!
FBIని కూడా వాడేస్తారా ? ఏపీ పరువుతీశారు..! జగన్ ఫైర్..!

తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి నోటీసు వచ్చిందని, గురువారం నాడు విచారణకు హాజరుకావాలని ఫోన్‌లో చెప్పారని, అయితే ఈ నోటీసు పూర్తిగా ఇన్‌ఫ్రక్చువస్ అన్నారు. సెప్టెంబర్ 11న హాజరుకావాలని పేర్కొన్న నోటీసును తనకు 18వ తారీఖున అందజేశారన్నారు. గడువు ముగిసిన తర్వాత చేరవేయడం అర్థం లేని విషయమన్నారు. అందుకే తతనకు లిఖితపూర్వకంగా ఫ్రెష్ నోటీసు అందజేయాలని అధికారులను కోరానన్నారు. అది అందాక తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. గత నెల 28న తనకు గుండెకు సంబంధించిన ప్రొసీజర్ జరిగిందని, అందులో రెండు స్టంట్లు వేశారని అంబటి తెలిపారు. ప్రస్తుతం రికవరీ దశలో ఉన్నానని, ఒత్తిడి తీసుకోవద్దని డాక్టర్లు సూచించారని తెలిపారు.

Don t Care Ambati Rambabu Calls ED Notice in Liquor Case NDA Vendetta Politics
ఆగని మంగళగిరి FBI రచ్చ..! ఏకేస్తున్న జాతీయ మీడియా..!
ఆగని మంగళగిరి FBI రచ్చ..! ఏకేస్తున్న జాతీయ మీడియా..!

ఈ నేపథ్యంలో విచారణకు ఎప్పుడు హాజరుకావాలనే దానిపై నా లీగల్ టీమ్‌తో పాటు వైద్యుల బృందాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటానన్నారరు. తాను లా చదువుకున్నవాడినని, బాధ్యతగల సీనియర్ రాజకీయ నాయకుడిని కాబట్టి విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని, తప్పించుకుని పారిపోయేవాడిని కానన్నారు. లిక్కర్ కేసుకు, తనకూ సంబంధం ఏమిటో తనకే ఆశ్చర్యంగా ఉందన్నారు. తనకు కొద్దిగా మద్యం తీసుకునే అలవాటు ఉందని, అంతకుమించి ఏ లిక్కర్ వ్యాపారంతోనూ ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈడీ నోటీసులో సత్తెనపల్లికి చెందిన తన సన్నిహితుడు మర్రి సుబ్బారెడ్డి పేరు ప్రస్తావించారని, ఆయన్ను విచారణ పేరుతో పిలిచి మ్యాన్‌హ్యాండిల్ చేసి, బలవంతంగా తన పేరు చెప్పాలని ఈడీ అధికారులు ఒత్తిడి తెచ్చారన్నారు. నార్త్ అధికారులకు తెలియక అంబటి రాయుడు పేరు చెప్పాలంటూ హింసించారని, అంటే నన్ను ఏదో రకంగా ఈ కేసులో ఇరికించాలని కొన్ని అదృశ్య శక్తులు తెరవెనుక ప్రయత్నిస్తున్నాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+