విజయమ్మ పెద్దరికం, వైవీ - బాలినేని చర్చలు: రూట్ క్లియర్.. అదే బాటలో..!?

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం. వైసీపీలో ఊహించని రాజకీయం. విజయమ్మ తిరిగి జగన్ కు మద్దతుగా వ్యవహరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొంత కాలంగా పార్టీలో.. కుటుంబం లో చోటు చేసుకున్న పరిణామాలను విజయమ్మ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. అందు లో భాగంగా వైవీ సుబ్బారెడ్డి- బాలినేని మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఇదే విధంగా పార్టీ వీడి వెళ్లిన వారి విషయంలోనూ ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.

వైసీపీలో తిరిగి పాత నేతల పునరేకీకరణ కు ప్రయత్నాలు మొదలయ్యాయి. 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత జరిగిన పొరపాట్లను సరి చేసుకునే విధంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. అందు లో భాగంగా విజయమ్మ తొలి ప్రయత్నం చేసారు. జగన్ - షర్మిల మధ్య గ్యాప్ తగ్గించే విధంగా వ్యవహరిస్తున్నట్లు పార్టీలోని ముఖ్య నేతల సమాచారం. అదే విధంగా తమ బంధువు బాలినేని వైసీపీ వీడి జనసేనలో ఉండటం.. అక్కడ ప్రాధాన్యత లేకపోవటంతో విజయమ్మ చొరవ తీసుకొని తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నించారని తెలుస్తోంది. అందులో భాగంగా పార్టీలో కీలక నేతగా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని రంగంలోకి దింపారని చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వైవీ సుబ్బారెడ్డి- బాలినేని మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తరువాత బాలినేని పార్టీ వీడే వరకూ వెళ్లాయి. ఇక, ఇప్పుడు పరిస్థితులు మారాయి.

 వైసీపీ మరో పోరు బాట, ప్రతీ మండలంలో- జిల్లాలకు జగన్..అక్కడే..!!
వైసీపీ మరో పోరు బాట, ప్రతీ మండలంలో- జిల్లాలకు జగన్..అక్కడే..!!
ysrcp-key-leader-yv-subba-redyy-holds-talks-with-balineni-with-vijayamma-suggestion-here-the-detail

వైసీపీలో మారుతున్న సమీకరణాలు

విజయమ్మ చొరవతో వైవీ సుబ్బారెడ్డి - బాలినేని మధ్య ఏకాంత చర్చలు జరిగినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇద్దరం కలిసి పని చేయటంతో పాటుగా.. సమిష్టిగా ఉండకపోతే భవిష్యత్ ఇద్దరికీ నష్టమనే చర్చ వారి మధ్య వచ్చినట్లు తెలుస్తోంది. బాలినేని పార్టీలోకి వస్తే తాను స్వాగతిస్తానని వైవీ చెప్పారని తెలిసింది. దీంతో.. స్థానిక ఎన్నికల వేళ వైసీపీలో కీలక పరిణామా లు జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. జగన్ తో మాట్లాడిన తరువాతనే ఈ ఏకాంత భేటీ జరిగిందని చెబుతున్నారు. దీంతో.. విజయమ్మ తిరిగి పార్టీ వ్యవహారాల పైన ఆలోచన చేయటం.. వైవీ - బాలినేని మధ్య చర్చలు జరగటం వంటి వాటి ద్వారా రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాల పైన వైసీపీలో ఆసక్తి నెలకొంది. తొలి నుంచి సన్నిహితంగా ఉంటూ పార్టీ వీడిన ముఖ్యులతోనూ చర్చలు జరుగుతాయని చెబుతున్నారు. కాగా, బాలినేని తిరిగి వైసీపీలోకి రావటం పైన నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇక.. ఈ చర్చలు.. ఇద్దరు ముఖ్య నేతల నుంచి అధికారికంగా స్పందన వస్తేనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+