ఆ మంత్రికి లాస్ట్ ర్యాంక్! లోకేష్, పవన్ పరిస్థితేంటి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగానికి ప్రాధాన్యతనిస్తూ మంత్రుల పనితీరుపై ప్రత్యేక నివేదికను సిద్ధం చేశారు. ప్రభుత్వ ఫైళ్ల పరిష్కారంలో మంత్రులు చూపిస్తున్న చొరవ, తీసుకుంటున్న సమయాన్ని ప్రాతిపదికగా తీసుకుని ర్యాంకులను కేటాయించారు. జూన్ 9 నుంచి సెప్టెంబరు 9 వరకు మంత్రుల శాఖల్లో ఫైళ్లు ఎంత వేగంగా క్లియర్ అయ్యాయనే డేటాను సేకరించి ఈ నివేదికను తయారు చేశారు.
ఈ నివేదికలో సీనియర్ నాయకుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చివరి స్థానంలో నిలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సాధించిన స్థానాలు ఆసక్తికరంగా మారాయి.
అగ్రస్థానంలో కింజరాపు అచ్చెన్నాయుడు.. సెకండ్ ప్లేస్‌లో నిమ్మల!
ఫైళ్ల పరిష్కారంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అగ్రస్థానంలో నిలిచారు. ఆయన 675 దస్త్రాలను పరిష్కరించగా, ఒక్కో ఫైలుకు సగటున కేవలం 1 గంట 51 నిమిషాల సమయం మాత్రమే తీసుకున్నారు. ఇక రెండో స్థానంలో నిలిచిన నిమ్మల రామానాయుడు 410 ఫైళ్లను పూర్తి చేసి, ఒక్కో దస్త్రానికి సగటున 6 గంటల 30 నిమిషాల సమయం వెచ్చించారు.

టాప్ 10లో నారా లోకేష్.. పవన్ కళ్యాణ్ పొజిషన్ ఏంటి?
ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అత్యధిక సంఖ్యలో ఫైళ్లను క్లియర్ చేసిన మంత్రుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన ఏకంగా 1,166 దస్త్రాలను పరిష్కరించి, ఒక్కో దస్త్రానికి 1 రోజు 7 గంటల 43 నిమిషాల సమయంతో 9వ ర్యాంకును కైవసం చేసుకున్నారు.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 612 దస్త్రాలను పరిష్కరించి 16వ స్థానంలో నిలిచారు. ఆయన ఒక్కో ఫైలు క్లియరెన్స్‌కు సగటున 2 రోజుల 15 గంటల 29 నిమిషాల సమయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) పరంగా చూస్తే, సీఎంఓ ఏకంగా 1,542 ఫైళ్లను పరిష్కరించి, సగటున 1 రోజు 20 గంటల సమయంతో 13వ స్థానంలో ఉంది.
ఆర్థిక మంత్రికి ఆఖరి ర్యాంక్.. ఎందుకింత ఆలస్యం?
ఈ నివేదికలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పనితీరు. ఆయన 258 ఫైళ్లను పరిష్కరించినప్పటికీ, ఒక్కో ఫైలు క్లియర్ చేయడానికి సగటున 7 రోజుల 9 గంటల 31 నిమిషాల సమయం తీసుకుని 25వ (చివరి) స్థానంలో నిలిచారు. ఆర్థిక శాఖలో ప్రతీ పైసా లెక్కలు, సాంకేతిక అంశాలు పరిశీలించాల్సి ఉండటమే ఈ ఆలస్యానికి కారణమని భావిస్తున్నప్పటికీ, ర్యాంకింగ్స్‌లో మాత్రం ఆయన వెనుకబడ్డారు.
మంత్రుల వారీగా ర్యాంకులు - సమయం పూర్తి వివరాలు (జూన్ 9 - సెప్టెంబరు 9):
- కింజరాపు అచ్చెన్నాయుడు: 1వ ర్యాంక్ (675 ఫైళ్లు - సగటు సమయం: 00 రోజులు - 01 గంట : 51 నిమిషాలు)
- నిమ్మల రామానాయుడు: 2వ ర్యాంక్ (410 ఫైళ్లు - సగటు సమయం: 00 రోజులు - 06 గంటలు : 30 నిమిషాలు)
- బీసీ జనార్దన్ రెడ్డి: 3వ ర్యాంక్ (148 ఫైళ్లు - సగటు సమయం: 00 రోజులు - 06 గంటలు : 52 నిమిషాలు)
- ఎన్.ఎమ్.డి ఫరూక్: 4వ ర్యాంక్ (275 ఫైళ్లు - సగటు సమయం: 00 రోజులు - 15 గంటలు : 01 నిమిషం)
- టీజీ భరత్: 5వ ర్యాంక్ (238 ఫైళ్లు - సగటు సమయం: 00 రోజులు - 19 గంటలు : 51 నిమిషాలు)
- పొంగూరు నారాయణ: 6వ ర్యాంక్ (643 ఫైళ్లు - సగటు సమయం: 00 రోజులు - 20 గంటలు : 39 నిమిషాలు)
- కొలుసు పార్థసారథి: 7వ ర్యాంక్ (80 ఫైళ్లు - సగటు సమయం: 01 రోజు - 00 గంట : 47 నిమిషాలు)
- డోలా బాల వీరాంజనేయస్వామి: 8వ ర్యాంక్ (131 ఫైళ్లు - సగటు సమయం: 01 రోజు - 03 గంటలు : 32 నిమిషాలు)
- నారా లోకేష్: 9వ ర్యాంక్ (1166 ఫైళ్లు - సగటు సమయం: 01 రోజు - 07 గంటలు : 43 నిమిషాలు)
- అనగాని సత్యప్రసాద్: 10వ ర్యాంక్ (773 ఫైళ్లు - సగటు సమయం: 01 రోజు - 09 గంటలు : 08 నిమిషాలు)
- సత్యకుమార్ యాదవ్: 11వ ర్యాంక్ (468 ఫైళ్లు - సగటు సమయం: 01 రోజు - 16 గంటలు : 55 నిమిషాలు)
- వాసంశెట్టి సుభాష్: 12వ ర్యాంక్ (148 ఫైళ్లు - సగటు సమయం: 01 రోజు - 18 గంటలు : 59 నిమిషాలు)
- ముఖ్యమంత్రి కార్యాలయం (CMO): 13వ స్థానం (1542 ఫైళ్లు - సగటు సమయం: 01 రోజు - 20 గంటలు : 05 నిమిషాలు)
- గొట్టిపాటి రవికుమార్: 14వ ర్యాంక్ (134 ఫైళ్లు - సగటు సమయం: 01 రోజు - 20 గంటలు : 05 నిమిషాలు)
- కొండపల్లి శ్రీనివాస్: 15వ ర్యాంక్ (45 ఫైళ్లు - సగటు సమయం: 02 రోజులు - 05 గంటలు : 03 నిమిషాలు)
- పవన్ కళ్యాణ్: 16వ ర్యాంక్ (612 ఫైళ్లు - సగటు సమయం: 02 రోజులు - 15 గంటలు : 29 నిమిషాలు)
- గుమ్మడి సంధ్యారాణి: 17వ ర్యాంక్ (119 ఫైళ్లు - సగటు సమయం: 02 రోజులు - 20 గంటలు : 41 నిమిషాలు)
- నాదెండ్ల మనోహర్: 18వ ర్యాంక్ (20 ఫైళ్లు - సగటు సమయం: 03 రోజులు - 00 గంట : 32 నిమిషాలు)
- కందుల దుర్గేష్: 19వ ర్యాంక్ (112 ఫైళ్లు - సగటు సమయం: 03 రోజులు - 04 గంటలు : 57 నిమిషాలు)
- వంగలపూడి అనిత: 20వ ర్యాంక్ (509 ఫైళ్లు - సగటు సమయం: 03 రోజులు - 09 గంటలు : 54 నిమిషాలు)
- ఆనం రామనారాయణరెడ్డి: 21వ ర్యాంక్ (157 ఫైళ్లు - సగటు సమయం: 04 రోజులు - 00 గంట : 42 నిమిషాలు)
- ఎస్. సవిత: 22వ ర్యాంక్ (116 ఫైళ్లు - సగటు సమయం: 04 రోజులు - 09 గంటలు : 17 నిమిషాలు)
- కొల్లు రవీంద్ర: 23వ ర్యాంక్ (255 ఫైళ్లు - సగటు సమయం: 06 రోజులు - 18 గంటలు : 10 నిమిషాలు)
- మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి: 24వ ర్యాంక్ (116 ఫైళ్లు - సగటు సమయం: 07 రోజులు - 04 గంటలు : 21 నిమిషాలు)
- పయ్యావుల కేశవ్: 25వ ర్యాంక్ (258 ఫైళ్లు - సగటు సమయం: 07 రోజులు - 09 గంటలు : 31 నిమిషాలు)














Click it and Unblock the Notifications
