నా సినిమాకు అలాంటి ట్యాగ్ పెట్టొద్దు..ది ప్యారడైజ్‌పై నాని క్లారిటీ..

Nani The Paradise: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం 'ది ప్యారడైజ్' సినిమాతో బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'దసరా' తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సెప్టెంబర్ 24న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు పలు భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నాని మీడియాతో మాట్లాడుతూ.. 'పాన్ ఇండియా' ట్యాగ్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తన సినిమాలకు పాన్ ఇండియా అనే ముద్ర వేయడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు.

'టాక్సిక్’ను మించిన దరిద్రం.. అంతకంటే భారీ నష్టాలు
'టాక్సిక్’ను మించిన దరిద్రం.. అంతకంటే భారీ నష్టాలు

నాని మాట్లాడుతూ.. ఒక హిందీ సినిమా దక్షిణాది భాషల్లో విజయం సాధించినా దాన్ని హిందీ సినిమాగానే పిలుస్తారని అన్నారు. అదే ఒక దక్షిణాది సినిమా దేశవ్యాప్తంగా సక్సెస్ అయితే వెంటనే దానికి పాన్ ఇండియా అనే ట్యాగ్ వస్తుందని చెప్పారు. ఈ తేడా తనకు నచ్చదని తెలిపారు. షారుక్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ సినిమాలను నాని ఉదాహరణగా ప్రస్తావించారు. ఈ సినిమాలు తెలుగు, తమిళంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఆదరణ పొందాయని గుర్తు చేశారు. అయినా వాటిని పాన్ ఇండియా సినిమాలు అని ప్రత్యేకంగా పిలవలేదని అన్నారు. కానీ సౌత్ సినిమాలకు మాత్రం ఈ ట్యాగ్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.

Nani Says The Paradise Should Not Be Called a Pan India Film
The Paradise Censor Review: నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ రివ్యూ.. థియేటర్ల పరిస్థితి ఏంటో..??
The Paradise Censor Review: నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ రివ్యూ.. థియేటర్ల పరిస్థితి ఏంటో..??

అందుకే తన సినిమాలకు కూడా ఆ ట్యాగ్ వద్దని నాని చెప్పారు. ప్రజలు ఏ సినిమా ఏ భాషలోనుంచి వచ్చిందనే దానికంటే.. కథ ఎలా ఉందో చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సినిమా బాగుంటే ఏ ప్రాంతానికి చెందిన ప్రేక్షకులైనా ఆదరిస్తారని అన్నారు. 'ది ప్యారడైజ్'ను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సహా పలు భాషల్లో విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు పాన్ ఇండియా అనే లేబుల్ పెట్టడం కంటే అన్ని భాషల ప్రేక్షకులు సినిమాను చూసి ఆస్వాదించాలన్నదే తన ఉద్దేశమని నాని చెప్పారు.

Varanasi: రాజమౌళి సంచలన నిర్ణయం.. మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా?
Varanasi: రాజమౌళి సంచలన నిర్ణయం.. మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా?

ఇక చెన్నైతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని కూడా నాని తెలిపారు. కమల్ హాసన్, భాగ్యరాజా, భారతీరాజా సినిమాలు చూస్తూ పెరిగానని చెప్పారు. తమిళ సినిమా తనకు చాలా ముఖ్యమని అన్నారు. తమిళ ప్రేక్షకులు తనను ఎప్పుడూ బాగా ఆదరించారని, అందుకు కృతజ్ఞతలు తెలిపారు. 'ది ప్యారడైజ్' సినిమా గురించి కూడా నాని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇది తన కెరీర్‌లో చాలా కష్టపడి చేసిన సినిమాల్లో ఒకటని పేర్కొన్నారు. దాదాపు 160 రోజుల పాటు షూటింగ్ జరిగిందని తెలిపారు. తన పాత్ర జడల్ కోసం చేసిన రూపం, లుక్ కూడా చాలా కష్టంగా అనిపించాయని చెప్పారు.

వారం తిరక్కముందే బిగ్ బాస్ లో మరో షాకింగ్ ఎలిమినేషన్: ట్విస్ట్ అద్దిరింది.. !!
వారం తిరక్కముందే బిగ్ బాస్ లో మరో షాకింగ్ ఎలిమినేషన్: ట్విస్ట్ అద్దిరింది.. !!

సినిమాలో జడల్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని నాని వెల్లడించారు. ఈ సినిమా విడుదల తర్వాత తనను 'నాని'గా కాకుండా 'జడల్'గా పిలుస్తారని నమ్మకం ఉందని అన్నారు. సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు మంచి మాస్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని చెప్పారు. మొత్తంగా 'పాన్ ఇండియా' అనే పదంపై నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన సినిమాలను ట్యాగ్‌లతో కాకుండా కంటెంట్‌తో ప్రేక్షకులు గుర్తించాలని ఆయన కోరుకుంటున్నారు. 'ది ప్యారడైజ్' ఎన్ని భాషల్లో విడుదలైనా.. తనకు మాత్రం అది ముందుగా తెలుగు సినిమా, మంచి కథతో వచ్చిన సినిమాగానే చూస్తానని నాని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+