విజయ్ కు ప్రధాని మోడీ గుడ్ న్యూస్..! ఉత్తర్వులు జారీ..!


తమిళనాడు (Tamil Nadu)లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించి సీఎంగా బాధ్యతలు చేపట్టిన జోసఫ్ విజయ్ (Joseph Vijay) ఇప్పుడు కేంద్రంతో సత్సంబంధాలు నెరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ సీఎం స్టాలిన్ హయాంలో ప్రధాని మోడీతో నిత్యం వాడీవేడీ విమర్శలు, ప్రతివిమర్శలు ఉండేవి. కానీ విజయ్ మాత్రం ఓవైపు బీజేపీని విమర్శిస్తూనే, కేంద్రాన్ని సమర్ధిస్తూ లౌక్యంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా ప్రధాని మోడీని ఢిల్లీ వెళ్లి కలిసిన విజయ్.. ఓ కీలక విజ్ఞప్తి చేశారు.

Advertisement
కూతురిని ముద్రగడ బహిష్కరణ వెనుక అసలు కారణం..! పవన్ తో సంబంధం లేదా ?
Advertisement

తమిళనాడులో ఎన్నికల సమయంలో ప్రధాన కార్యదర్శిని మార్చిన ఎన్నికల సంఘం.. కొత్త సీఎస్ గా ఎం సాయి కుమార్ ను నియమించింది. ఆయన పదవీకాలం త్వరలో ముగుస్తోంది. దీంతో ప్రధాని మోడీని సీఎస్ పదవీకాలం పొడిగించాలని విజయ్ కోరారు. ఈ మేరకు తాజాగా ఓ లేఖ కూడా రాశారు. దీనిపై స్పందించిన కేంద్రం.. ఇవాళ సీఎస్ గా సాయి కుమార్ పదవీకాలం మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

Mudragada: ముద్రగడ మృతిపై సంతాపాల వెల్లువ..! జగన్, పవన్ సహా నేతల ప్రకటనలు..!
Advertisement

1990 తమిళనాడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సాయికుమార్ పదవీకాలం ఆగస్టు 31తో ముగుస్తున్న నేపథ్యంలో దాన్ని మరో ఆరు నెలల పాటు అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకూ పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీఎస్ ఎంపిక విషయంలో విజయ్ కు ఊరట లభించినట్లయింది. ఈ ఆరు నెలలు ముగిసేలోగా విజయ్ కొత్త సీఎస్ ను ఎంపిక చేయాల్సి ఉంటుంది.