విజయ్ కోసం సొంత పార్టీపై కస్తూరి తిరుగుబాటు..! కుట్ర, నీచమైన ఆట..!

తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే (TVK)కు మెజార్టీని సాకుగా చూపుతూ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడంపై రాష్ట్రంలో ఆగ్రహం పెరుగుతోంది. ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమతో పాటు ఓటర్లు కూడా బీజేపీ తీరుపై మండిపడుతున్నారు. ఇదే క్రమంలో బీజేపీ నేతలు సైతం సొంత పార్టీ తీరుపై మండిపడుతున్నారు. ఇందులో సీనియర్ నటి కస్తూరి (Kasturi) కూడా చేరిపోయారు. విజయ్ కు తమ పార్టీ బీజేపీ కల్గిస్తున్న అవాంతరాలపై మండిపడ్డారు.

విజయ్‌కి డీఎంకే మద్దతు? బీజేపీ ప్లాన్ కు చెక్ పెట్టేలా..!
విజయ్‌కి డీఎంకే మద్దతు? బీజేపీ ప్లాన్ కు చెక్ పెట్టేలా..!

తమిళనాడు ప్రజలు విజయ్‌కి అఖండ మెజారిటీతో ఓటు వేశారని, టీవీకే అతిపెద్ద పార్టీ అని, వారిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించి, ఫ్లోర్ టెస్ట్‌లో మెజారిటీని నిరూపించుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందని కస్తూరి తెలిపారు. ఎలాంటి జాప్యపు ఎత్తుగడలనైనా తమిళనాడు ప్రజలు, ఇతర ప్రాంతాల వారు కూడా కుట్రగా భావిస్తారన్నారు. దానికి వారు నేరుగా బీజేపీనే నిందిస్తారన్నారు. విజయ్ మార్గంలో ఎదురయ్యే ఎలాంటి అడ్డంకినైనా, అది నిజం కాకపోయినా, రాజ్యాంగపరమైన జాప్యంగా కాకుండా, కేవలం బీజేపీ ఆడుతున్న నీచమైన ఆటగా మాత్రమే చూస్తారని కస్తూరి స్పష్టం చేశారు.

Kasturi Revolts Against BJP s Anti-TVK Plans Backs Vijay s Government Formation Bid
Vijay: విజయ్ కు మళ్లీ గవర్నర్ షాక్..! రెండోసారీ నిరాశే..!
Vijay: విజయ్ కు మళ్లీ గవర్నర్ షాక్..! రెండోసారీ నిరాశే..!

తమిళనాడు తదుపరి ప్రభుత్వానికి తాను అడ్డుగా నిలబడనని స్టాలిన్ ఇప్పటికే స్పష్టం చేశారని, దీంతో, అసంతృప్తితో ఉన్న ప్రజలకు బీజేపీ మాత్రమే ఏకైక లక్ష్యంగా మిగిలిందన్నారు. అందువల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా కొత్త ప్రభుత్వ ఏర్పాటును వేగవంతం చేయడం పూర్తిగా బీజేపీ ప్రయోజనాలకు అనుకూలమైనది అంటూ కస్తూరీ ఎక్స్ లో పెట్టిన పోస్టులో పేర్కొన్నారు. దీంతో బీజేపీ సహా తమిళనాడులో సినీ పరిశ్రమ కూడా కేంద్రం ఎత్తుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అయినా గవర్నర్ అర్లేకర్ మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+