Super El Nino : వర్షాలు మర్చిపోండిక- ప్రపంచ వాతావరణ సంస్థ షాకింగ్ రిపోర్ట్..!

ఈ ఏడాది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో (EL Nino) ప్రభావంతో భారత్ లో నైరుతి రుతుపవనాల జాడ కనిపించడం లేదు. మొదట్లో సకాలంలో వచ్చినట్లే వచ్చి వెళ్లిపోయిన రుతుపవనాలు ఆ తర్వాత బలహీన పడటం ప్రారంభమైంది. ఇప్పుడు బంగాళాఖాతంతో పాటు అరేబియా సముద్రంలో అడపాదడపా అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడితే తప్ప వర్షాలు కురిసే పరిస్ధితి లేదు. ఇప్పటికే ఆగస్టు నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే ఉంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు చేసింది. ఈ ప్రకటన వచ్చిన 24 గంటల్లోనే ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ(WMO) మరో షాకిచ్చింది.

Advertisement
EL Nino: ఎల్ నినో ముప్పులో ఏపీ-సర్కార్ కీలక ఆదేశాలు-కంట్రోల్ రూమ్ ..!
Advertisement

ఈ సీజన్ లో ఇప్పటికే కురవాల్సిన వర్షపాతం కన్నా చాలా చోట్ల తక్కువ వర్షపాతం నమోదవుతుండగా.. ఇప్పుడు ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రమై రుతుపవనాల్ని మరింత బలహీనం చేయబోతోందని ఐక్యరాజ్యసమితికి చంెదిన ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తన తాజా రిపోర్ట్ లో పేర్కొంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇప్పటికే ఆగస్టులో సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని అంచనా వేసింది. ఇప్పుడు ప్రపంచ వాతావరణ సంస్థ కూడా రుతుపవనాలు మరింత బలహీన పడటం ఖాయమని తేల్చేయంతో ఈసారి సాధారణ స్ధాయి వర్షాలు లేకుండానే వర్షాకాలం ముగిసిపోయేలా కనిపిస్తోంది.

Advertisement

El Nino: చావు కబురు చల్లగా చెప్పిన ఐఎండీ- ఆగస్టులో వర్షాలపై తాజా అప్డేట్..!

ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు-అక్టోబర్ కాలంలో సూపర్ ఎల్ నినో బలపడుతుందని అంచనా వేసింది.
అసాధారణంగా వేడెక్కిన సముద్రాలు, సానుకూల భారతీయ సముద్రాల పరిస్థితులతో పాటు, ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతల్ని అసాధారణంగా పెంచేయడంతో పాటు వర్షపాత సరళిని గణనీయంగా మారుస్తుందని భావిస్తున్నారు. దీనివల్ల కొన్ని ప్రాంతాలు అధిక వర్షపాతాన్ని పొందే అవకాశం ఉండగా, మరికొన్ని ప్రాంతాలు కరువు ముప్పును ఎదుర్కోవచ్చు. ఈ ఏడాది దేశంలో రుతుపవనాల పరిస్దితి దారుణంగా ఉంది. చాలా ప్రాంతాలలో రుతుపవనాల పురోగతి నిలిచిపోయింది. దీంతో జూన్, జూలై నెలల్లో భారీగా వర్షపాత లోటు కనిపించింది. ఇప్పుడు ఆగస్టులోనూ అదే పరిస్ధితి తప్పేలా లేదు. ఇక మిగిలిన సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సూపర్ ఎల్ నినో ప్రభావం ఉంటుందన్న హెచ్చరికలతో వర్షాకాలం ఇక లేకపోవచ్చని అర్థమవుతోంది.