సీఎం అవుతూనే త్రిష పై విజయ్ ఊహించని నిర్ణయం..!?

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు (గురువారం) విజయ్ టీం కొలువు తీరనుంది. కొత్త మంత్రుల పైనా విజయ్ నిర్ణయం తీసుకున్నారు. నాలుగు పార్టీలతో కలిసి విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అవుతున్న వేళ త్రిష విషయంలో విజయ్ తీసుకునే నిర్ణయాల పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది. అయితే.. త్రిష విషయంలో ఇప్పటికే విజయ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

టీవీకే చీఫ్ ఎన్నికల్లో సంచలన విజయంతో కొన్ని కీలక నిర్ణయాలకు సిద్దం అయ్యారు. భారీ మెజార్టీ తో విజయం సాధించిన విజయ్ ఎక్కడా.. తన పైనా..తన ప్రభుత్వం పైన విమర్శలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా మంత్రివర్గ కూర్పు పైనా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. డీఎంకే- అన్నా డీఎంకే నుంచి ఫిరాయించి తన పార్టీలోకి వస్తానని ముందుకు వచ్చిన వారికి నో చెప్పారు.

Vijay key decision over Trichy East While Trisha Episode Drives Public Curiosity here the details

ఇక.. త్రిష విషయంలో విజయ్ ఏం చేయబోతున్నారనేది చర్చ సాగుతోంది. రెండు నియోజకవర్గాల నుంచి గెలుపొందిన విజయ్ పెరంబూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతూ... తిరుచ్చి ఈస్ట్ కు రాజీనామా చేస్తారని చెబుతున్నారు. ఈ సీటును త్రిష కు కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది. అయితే, దీనికి విజయ్ సన్నిహిత వర్గాలు బ్రేక్ వేసాయి. త్రిషకు తిరుచ్చి సీటు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.

తమిళనాడులో బీజేపీకి విజయ్ ఊహించని వరం- ఢిల్లీ మార్క్ గేమ్..!!
తమిళనాడులో బీజేపీకి విజయ్ ఊహించని వరం- ఢిల్లీ మార్క్ గేమ్..!!

కేబినెట్ లోకి మాజీ ఐఏఎస్.. తిరుచ్చి సీటు

ఇదే సమయంతో తిరుచ్చి ఈస్ట్ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి సగాయంకు టికెట్‌ కేటాయిస్తారనే సంకేతాలు అందుతున్నాయి. అవినీతి వ్యతిరేక పోరాటంతో తమిళనాడులో ప్రత్యేకంగా గుర్తింపు పొందిన సగాయం కు నిజాయితీ అధికారిగా పేరు ఉంది. దీంతో.. సగాయంను ఈ స్థానం నుండి బరిలోకి దింపాలని విజయ్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తొలి సారి సీఎం అవుతున్న తనకు పాలనా పరంగా సీనియర్ అధికారుల మద్దతు అవసరమని విజయ్ గుర్తించారు.

అందులో భాగం గా తన కేబినెట్ లో ముందుగా సగాయంకు మంత్రి పదవి ఇచ్చి.. ఆరు నెలల్లో జరిగే తిరుచ్చి ఈస్ట్ బై పోల్ లో టీవీకే నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ప్రజల్లో తన ఇమేజ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. కాగా.. త్రిషకు ఇప్పటికిప్పుడు ప్రభుత్వంలో ఏ పదవీ ఇచ్చే అవకాశం లేదని.. భవిష్యత్ లో ప్రాధాన్యత ఉన్న బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+