తమిళనాడులో బీజేపీకి విజయ్ ఊహించని వరం- ఢిల్లీ మార్క్ గేమ్..!!

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళనాడులో విజయ్ కు మద్దతు ఇవ్వాలనే కాంగ్రెస్ నిర్ణయం సంచలనంగా మారుతోంది. డీఎంకే తో కలిసి కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలోనూ డీఎంకే కీలకంగా ఉంది. కాగా, ఈ సమయంలో డీఎంకే తో కాదని... విజయ్ తో నడవాలనే కాంగ్రెస్ నిర్ణయం తమిళనాడుతో పాటుగా జాతీయ స్థాయిలోనూ కొత్త సమీకరణాలకు కారణం అవుతోంది. దీంతో... విజయ్ తాజా అడుగులు పరోక్షంగా బీజేపీకి మేలు చేసే విధంగా మారుతున్నాయి.

తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు వేళ కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. విజయ్ కు ప్రభుత్వం ఏర్పాటులో సహకరించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నిర్ణయం మిత్ర పక్షంగా ఉన్న డీఎంకే కు రుచించటం లేదు. ఈ నిర్ణయం పైన ఆగ్రహంగా ఉన్న డీఎంకే నేతలతో మాజీ సీఎం స్టాలిన్ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో తాము ఇక వారితో కలిసి ప్రయాణం చేయలేమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Congress DMK Strain Fuels Split Talk Tamil Nadu Political Realignment May Indirectly Benefit BJP here the details

ఇటు విజయ్ ఎన్నికల ఫలితాల సమయం నుంచీ కాంగ్రెస్ తో కలిసేందుకే ఆసక్తితో ఉన్నారు. అయితే.. పార్లమెంట్ లో డీఎంకే కు ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఇండియా కూటమిలోనూ డీఎంకే కీలకంగా వ్యవహరిస్తున్న వేళ... ఇప్పుడు కాంగ్రెస్ తీరుతో కూటమికి గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఈ నిర్ణయం కోసం అటు బీజేపీ వేచి చూస్తోంది. డీఎంకే అదే నిర్ణయం తీసుకుంటే... విపక్ష కూటమి మరింత బలహీన పడటం ఖాయమనేది బీజేపీ నేతల అంచనా.

జాతీయ స్థాయిలోనూ మారుతున్న లెక్కలు

తమిళనాడులో అన్నా డీఎంకేతో కూటమిగా ఏర్పడటం ద్వారా ప్రయోజనం పొందాలని బీజేపీ లెక్కలు కట్టింది. స్టాలిన్ ను ఓడించటం ద్వారా.. దక్షిణాది లో ఇండియా కూటమిని బలహీన పర్చే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఎన్నికల్లో అది సాధ్యపడ లేదు. అయితే, విజయ్ గెలిచి సీఎం అవుతన్న వేళ.. ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలు పరోక్షంగా బీజేపీకి మేలు చేసే విధంగా మారుతున్నాయి.

ఈ సమయంలోనే బీజేపీ పట్టు బిగించింది. అన్నా డీఎంకే- ఎన్డీఏ కూటమి లో భాగస్వాములు విజయ్ తో వెళ్లకుండా.. కాంగ్రెస్ టీవీకే తో జత కట్టే పరిస్థితి బీజేపీ నేతలు కల్పించారు. దీంతో.. అటు విజయ్ పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తున్నారనే విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి కొనసాగటం పైన స్టాలిన్ తీసుకొనే నిర్ణయం జాతీయ స్థాయి లోనూ రాజకీయాల పైన ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+