దీపావళి వేళ రూ 35కే కిలో ఉల్లి, తక్కవ ధరకే బియ్యం- ఆధార్ చాలు, ఇలా చేయండి..!!
పండుగ వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి.. బియ్యం ధరల నుండి సామాన్య వినియోగదారులకు ఉపశమనం కలిగించే నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా కిలో కేవలం రూ.35 లకే సామాన్యులకు అందు బాటు లోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ప్రత్యేక కేంద్రాల ద్వారా సబ్సిడీ ధరలకే బియ్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీంతో.. సామాన్యులకు రిలీఫ్ దక్కనుంది.
ఏపీ ప్రభుత్వం సామాన్యులకు ఉపశమనం కలిగించేలా కొత్త నిర్ణయాలు అమల్లోకి తెచ్చింది. ఓపెన్ మార్కెట్ లో ఒక్క సారిగా భారీగా పెరిగిన ఉల్లి ధరలతో సామాన్యులకు భారంగా మారింది. దీంతో, ధరల స్థిరీకరణ చర్యల్లో భాగంగా నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మద్దతుతో మహారాష్ట్ర మార్కెట్ నుండి నాణ్యమైన ఉల్లిని ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేస్తోంది. ఈ నిల్వలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా కిలో కేవలం రూ.35 లకే సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. సబ్సిడీ ఉల్లిని పొందాలనుకునే వినియోగదారులు తమ ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్‌ను కౌంటర్ల వద్ద తప్పని సరిగా చూపించాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం ఒక కుటుంబానికి నిర్దేశిత పరిమితి.. అంటే నెలకు గరిష్టంగా 2 కిలోల చొప్పున మాత్రమే ఈ ధరకు పంపిణీ చేయనున్నారు.

రైతు బజార్లలో ప్రత్యేక కేంద్రాలు
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి తక్కువ ధరకు రైతు బజార్లలో ఉల్లిపాయలు అందించను న్నట్లు పౌర సరఫరాలశాఖ కమిషనర్ కన్నబాబు స్పష్టం చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. అన్ని రైతు బజార్లకు వీటిని పంపిణీ కోసం ఇప్పటికే తరలించారు. రైతు బజార్లలో తగినన్నీ ఉల్లి నిల్వలు అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా సన్నబియ్యం ధరలు పెరిగాయి. దీంతో ఏపీలో కూడా బియ్యం ధరలు అమాంతం పెరిగాయి. సామాన్యులకు భారంగా మారగా.. ప్రభుత్వం సబ్సిడీ ధరలకు అందించే విధంగా ఏర్పాట్లు చేసారు. రైతు బజార్లలో ధరణి బ్రాండ్ బియ్యంను రాయితీ ధరలకు అందిస్తోంది. ధరణి బ్రాండ్ 26 కేజీల బియ్యం బస్తాను రూ.1300కే విక్రయిస్తోంది. ఇక బీపీటీ సూపర్ ఫైన్ బియ్యంను కిలో రూ.49 నుంచి 52కు ఇస్తోంది. ఇక కేన్ఎం, నెల్లూరు సన్నాలను కిలో రూ.50కి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications
