Moral stories:బంగారు మామిడి కోసం పూజారుల దురాశ..తెనాలి రాముడి తెలివైన ఎత్తుగడ!

మనుషులకు కష్టాలు వచ్చినప్పుడు కొందరు ధైర్యం చెబుతారు..మరికొందరు ఆ కష్టాలనే తమకు అవకాశంగా మార్చుకుంటారు.ముఖ్యంగా అమాయకుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని స్వార్థం కోసం పక్కదారి పట్టించేవారు ఎప్పుడూ ఉంటారు.అలాంటి వారిని బలంతో కాకుండా తెలివితో ఎలా ఎదుర్కోవాలో చెప్పే అద్భుతమైన కథ తెనాలి రామకృష్ణుడిది.తన తల్లి చివరి కోరిక పేరుతో రాజును మోసం చేసిన పూజారులకు తెనాలి రాముడు ఎలాంటి గుణపాఠం నేర్పాడో తెలుసుకుందాం.

తల్లి చివరి కోరిక..రాజు మనసులో ఆవేదన

విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్న రోజుల్లో ఆయన తల్లి అనారోగ్యంతో కన్నుమూశారు.అయితే చనిపోయే ముందు ఆమెకు మామిడి పండ్లు తినాలనే కోరిక ఉండేది.ఆ కోరిక తీరకుండానే తల్లి మరణించడంతో రాజు తీవ్రంగా బాధపడ్డాడు.ఈ విషయాన్ని తెలుసుకున్న రాజపురోహితుడు తన దుర్బుద్ధికి పదును పెట్టాడు.

moral-stories-golden-mangoes-for-priests-tenali-rama-s-unexpected-trick-changed-everything

రాజు బాధను ఆసరాగా చేసుకుని,విజయనగరంలోని బ్రాహ్మణులందరికీ విందు ఏర్పాటు చేసి,ఒక్కొక్కరికి ఒక బంగారు మామిడి పండు దానం చేస్తే మహారాణి ఆత్మకు శాంతి కలుగుతుందని సలహా ఇచ్చాడు.తల్లి మీద ఉన్న ప్రేమతో రాజు వెంటనే అందుకు అంగీకరించాడు.అనుకున్నట్లుగానే పూజారులందరికీ బంగారు మామిడి పండ్లు దక్కాయి.

యమలోకంలో వేటగాడికి షాక్ - తలరాతను మార్చేసిన ఓ చిన్న పిట్ట..!!
యమలోకంలో వేటగాడికి షాక్ - తలరాతను మార్చేసిన ఓ చిన్న పిట్ట..!!

తెనాలి రాముడి వినూత్న ఉపాయం

ఈ విషయం తెలుసుకున్న తెనాలి రామకృష్ణుడికి పూజారుల దురాశపై కోపం వచ్చింది.వారికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు.కొన్ని రోజుల తర్వాత తన ఇంట్లో కూడా బ్రాహ్మణులందరికీ ఘనంగా విందు ఏర్పాటు చేశాడు.భోజనాల అనంతరం వారందరినీ పెరట్లోకి తీసుకెళ్లాడు.అక్కడ కొందరు ఇనుప కడ్డీలను నిప్పుల్లో ఎర్రగా కాలుస్తున్నారు.

అది చూసిన పూజారులు భయంతో వణికిపోయారు.ఇదేమిటని ప్రశ్నించగా,తెనాలి రాముడు ప్రశాంతంగా ఇలా చెప్పాడు."మా అమ్మకు చనిపోయే ముందు మోకాళ్లలో తీవ్రమైన నొప్పి ఉండేది.ఆమెకు వైద్యం చేసిన ఆయుర్వేద వైద్యుడు,ఎర్రగా కాల్చిన ఇనుప కడ్డీలతో మోకాళ్లకు వాత పెడితే నొప్పి తగ్గుతుందని చెప్పాడు.కానీ ఆ చికిత్స చేయకముందే మా అమ్మ చనిపోయింది.ఇప్పుడు ఆమె ఆత్మకు శాంతి కలగాలంటే మీ అందరికీ ఆ చికిత్స చేయాలి"అన్నాడు.

Moral story:ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయా..ఈ కథ చదవండి..!!
Moral story:ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయా..ఈ కథ చదవండి..!!

దురాశకు తగిన గుణపాఠం

తెనాలి మాటలు విన్న పూజారులకు విషయం అర్థమైంది.రాజు తల్లి పేరుతో తాము చేసిన మోసాన్నే తెనాలి తమకు తిరిగి చూపిస్తున్నాడని గ్రహించారు.భయంతో వెంటనే రాజు దగ్గరకు వెళ్లి తమకు ఇచ్చిన బంగారు మామిడి పండ్లన్నింటినీ తిరిగి ఇచ్చేశారు.తమ తప్పును ఒప్పుకుని సిగ్గుతో తలదించుకున్నారు.అప్పుడు తెనాలి రామకృష్ణుడు తన తెలివితో దురాశపరులకు తగిన గుణపాఠం నేర్పాడు.

ఈ కథలోని నీతి: ఇతరుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని స్వార్థం కోసం మోసం చేయకూడదు.దురాశ ఎప్పటికైనా అవమానాన్నే మిగులుస్తుంది.అన్యాయాన్ని ఎదుర్కోవడానికి బలం కంటే తెలివి గొప్ప ఆయుధమని ఈ కథ మనకు తెలియజేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+