కెమేరా ముందుకు మళ్లీ సీఎం విజయ్, గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో- అక్కడే అసలు ట్విస్ట్..!!
తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. మళ్లీ కెమేరా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. గౌతమ్ వాసుదేవ మీనన్ కు దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి అయిన తరువాత సినిమాలకు దూరంగా ఉన్న విజయ్ ఇప్పుడు తిరిగి కెమేరా ముందుకు వెళ్లటం అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. అయితే, ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఆ నిర్ణయమే ఇప్పుడు విజయ్ అభిమానులతో పాటుగా టీవీకే మద్దతు దారుల్లో ఉత్కంఠగా మారుతోంది.
తమిళనాడు సీఎం విజయ్ సంచలన నిర్ణయాలకు కేంద్రంగా నిలుస్తున్నారు. పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విజయ్ ఇప్పుడు మరో సారి మేకప్ వేసుకొని కెమేరాల ముందు కు వచ్చేందు సిద్దమయ్యారు. ఈ సారి దర్శకత్వ బాధ్యతలను గౌతమ్ వాసుదేవ మీనన్ కు అప్పగించారు. అయితే, ఇది సినిమా కోసం కాదు. తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, ప్రజా సంక్షేమ నిర్ణయాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సీఎం విజయ్ స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించారు.

సహజంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ప్రచారం కోసం బ్రాండ్ అంబాసిడర్లను ఎంచుకుంటారు. అయితే, విజయ్ తానే స్వయంగా ఈ యాడ్‌లో నటించాలని నిర్ణయించారు. ఇందు కోసం ప్రత్యేకంగా యాడ్ సిద్దం చేస్తున్నారు. దీంతో ఈ యాడ్ షూట్‌పై అటు సినీ.. ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి పెరుగుతోంది.
కాగా, తన ప్రచార ప్రకటనకు దర్శకత్వ బాధ్యతలను ప్రముఖ సినీ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు అప్పగించారు. వీరిద్దరి కాంబినేషన్ అనగానే అభిమానులతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ యాడ్ షూట్ కోసం సీఎం విజయ్ రెండు రోజుల సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించారు. ఈ ప్రకటనను ఓ షార్ట్ ఫిలిం తరహాలో అత్యంత వైభవంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మహిళలకు ఆర్థిక సహాయ పథకాలు, ఉచిత విద్యుత్, ఆరోగ్య రక్షణ పథకాలతో పాటుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం.. తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా ఈ యాడ్ సిద్దం చేస్తున్నారు. అయితే.. సీఎం అయిన తరువాత సినిమాలకు దూరమైన విజయ్‌ని మళ్లీ వెండితెరపై కనిపించని అభిమానులకు.. ఇప్పుడు ఈ నిర్ణయంతో జోష్ పెరుగుతోంది.














Click it and Unblock the Notifications
