స్ధానిక ఎన్నికల్లో జగన్ సక్సెస్ ?- టీడీపీ ఆస్థాన సర్వేయర్ సంచలన ట్వీట్ ..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా జరుగుతున్నాయి. ఇప్పటికే కోర్టు కేసులున్న కొన్ని చోట్ల మినహా మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. వీటిలో కూటమి ఏకపక్షంగా విజయాలు సాధించింది. ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం భారీ విజయాలు నమోదు చేసుకుంటోంది. దీంతో విపక్ష వైఎస్సార్సీపీ తేలిపోతోంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్ని కూటమి సునాయాసంగా గెలుస్తుందని అంతా భావిస్తున్నారు. కానీ వైఎస్సార్సీపీ ఇచ్చిన పోటీపై టీడీపీ అనుకూల సర్వే నిపుణుడు ఒకరు కూటమికి గుర్తుచేశారు.

Amaravati: అమరావతిలో మళ్లీ వరద ముంపు?- తేల్చేసిన ఏపీ సర్కార్..!
Amaravati: అమరావతిలో మళ్లీ వరద ముంపు?- తేల్చేసిన ఏపీ సర్కార్..!

ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ జగన్ (YS Jagan) నేతృత్వంలోని వైఎస్సార్సీపీ పోటీ చేస్తుందని, అభ్యర్ధుల్ని పోటాపోటీగా నిలబెడుతుందని, ఎన్నికల్లో ఓటమి పాలవుతామని తెలిసినా పోరాటం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ కూటమి అంచనాల్ని తలకిందులు చేస్తూ వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో అన్నిచోట్లా అభ్యర్ధుల్ని నిలబెట్టారు. అలాగే దాడులు, దౌర్జన్యాలు జరిగినా వెనక్కి తగ్గకుండా అభ్యర్ధులతో పోటీ చేయించారు. దీంతో పూర్తి ఏకపక్షంగా సాగాల్సిన ఎన్నికలు కాస్తా విజయాల్లో మాత్రం ఏకపక్షంగా మారాయి. ఇదే అంశంపై టీడీపీ అనుకూల సర్వే నిపుణుడిగా పేరున్న ప్రవీణ్ పుల్లట ఇవాళ ట్వీట్ చేశారు.

YS Jagan Gives TDP Alliance a Tough Fight in Local Body Polls Says Pro-TDP Survey Expert
ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్లలోనూ కూటమి ప్రభంజనం- తాజా అప్డేట్ ఇదే..!
ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్లలోనూ కూటమి ప్రభంజనం- తాజా అప్డేట్ ఇదే..!

సహజంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని, కాని ఈసారి వైసీపీ కలబడి తలపడి గట్టిపోటీ ఇస్తోందని సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట వెల్లడించారు. ఇది ఇంటరెస్టింగ్ థింగ్ అన్నారు. 2021లో ఇలాంటి స్ధానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీకి కూడా వెనుకంజ వేసిందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కార్యకర్తల్ని క్షేత్రంలో యాక్టివ్ గా ఉంచడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినట్లే! అని ప్రవీణ్ పుల్లట విశ్లేషించారు. తద్వారా జగన్ ఈ ఎన్నికల్లో పోటీకి వెనక్కి తగ్గకుండా నిలబడటం ద్వారా పొలిటికల్ గా సక్సెస్ అయ్యారని చెప్పకనే చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+