ఎలుగుబంట్ల సర్వే.. దేశ చరిత్రలోనే తొలిసారి లెక్కలు

భారత అడవుల్లో సంచరించే వివిధ రకాల వన్యప్రాణుల లెక్కలను తేల్చేందుకు అధికారులు ఎప్పుడూ ముందుంటారు. అయితే, తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు రకాల ఎలుగుబంట్ల జాతుల సంఖ్యను కచ్చితంగా అంచనా వేసేందుకు డెహ్రాడూన్‌లోని ప్రసిద్ధ 'వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా' (WII) ఒక బృహత్తర కార్యక్రమానికి సిద్ధమైంది. దేశంలోని రక్షిత అడవుల్లో విలవవిలా లాడిస్తున్న మానవ-ఎలుగుబంటి సంఘర్షణలను (Human-Bear Conflict) తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక సర్వే చేపట్టనున్నారు. అన్ని జాతుల ఎలుగుబంట్ల పూర్తి గణాంకాలు వెలుగులోకి రావడానికి సుమారు ఐదేళ్ల సమయం పట్టనుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

భారతదేశం జీవవైవిధ్యానికి నిలయం. ఇక్కడ మొత్తం నాలుగు రకాల ఎలుగుబంటి జాతులు జీవిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వంటి అత్యున్నత హిమాలయ ప్రాంతాల్లో 'హిమాలయన్ బ్రౌన్ బేర్' (గోధుమ ఎలుగుబంటి), 'ఆసియాటిక్ బ్లాక్ బేర్' (నల్ల ఎలుగుబంటి) ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇక మన దేశంలోని పొడి అడవులు, ముళ్ల పొదలు, నేల ప్రాంతాల్లో 'సోమరి ఎలుగుబంటి విస్తృతంగా కనిపిస్తుంది. అలాగే ఎలుగుబంట్ల కుటుంబంలోనే అత్యంత చిన్నదైన 'సన్ బేర్' జాతి ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశ్ సరిహద్దుల దట్టమైన అడవుల్లో అరుదుగా జీవిస్తోంది.

India To Estimate All 4 Bear Species Population WII Launches Major 5 Year Survey To Reduce Human Conflicts
Viral Video: రైల్వే ట్రాక్‌పై హాయిగా షికారు చేసిన ఎలుగుబంటి
Viral Video: రైల్వే ట్రాక్‌పై హాయిగా షికారు చేసిన ఎలుగుబంటి

ఎక్కవవుతున్న దాడులు..

దేశవ్యాప్తంగా ఎలుగుబంట్లకు, మనుషులకు మధ్య ఘర్షణలు రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో 'స్లాత్ బేర్' వల్ల మానవ సంచార ప్రాంతాల్లో సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. హిమాలయ ప్రాంతాల్లో గోధుమ, నల్ల ఎలుగుబంట్ల వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు లెక్కలేనన్ని ఉన్నాయి. అయితే, అత్యంత చిన్నదైన 'సన్ బేర్' జాతితో మాత్రం మనుషులకు ఎదురుపడే సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఈ ఘర్షణలకు గల అసలు కారణాలను విశ్లేషించి, వాటికి శాశ్వత పరిష్కారాలు కనుగొనేందుకే ఈ భారీ సర్వే దోహదపడనుంది.

ఈ జింక అచ్చం కుందేలులా ఉందే! ప్రపంచంలోనే అరుదైన బుజ్జి జీవి
ఈ జింక అచ్చం కుందేలులా ఉందే! ప్రపంచంలోనే అరుదైన బుజ్జి జీవి

ఐదేళ్ల పాటు సాగే సుదీర్ఘ కసరత్తు

ఈ ఎలుగుబంట్ల సర్వే కేవలం ఒక్క ఏడాదిలో ముగిసేది కాదని, దీనికోసం సుమారు ఐదేళ్ల సమయం పడుతుందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. మొదటగా స్లాత్ ఎలుగుబంట్ల సమస్యలపై దృష్టి సారించి, ఆ తర్వాత మిగతా మూడు జాతులపై ప్రత్యేక ప్రతిపాదనలను సిద్ధం చేసి క్షేత్రస్థాయిలో పరిశోధనలు జరుపుతారు. ఈ శాస్త్రీయ అధ్యయనం ద్వారా ఎలుగుబంట్ల ఆవాసాలను రక్షించడంతోపాటు, అడవులకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలకు రక్షణ కల్పించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+