వెంటాడుతున్న మృత్యువు! ట్రంప్‌పై జరిగిన 5 భయంకర దాడులు!

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తూటాల గర్జన వినిపించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా జరిగినట్లు భావిస్తున్న కాల్పుల ఘటన అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. వాషింగ్టన్ డీసీలోని హిల్‌టన్ హోటల్‌లో వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ అత్యంత వైభవంగా జరుగుతుండగా.. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించడంతో అక్కడ ఉన్నవారంతా భయభ్రాంతులకు గురయ్యారు.

కాల్పుల శబ్దం వినిపించగానే అధ్యక్షుడి రక్షణ విభాగం (సీక్రెట్ సర్వీస్) మెరుపు వేగంతో స్పందించింది. వేదికపై ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఉపరాష్ట్రపతి జేడీ వాన్స్‌లను రక్షణ కవచంలా చుట్టుముట్టి వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ అనూహ్య ఘటనతో ప్రతిష్ఠాత్మక డిన్నర్ కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచిపోయింది.

From Butler to Washington DC How Many Times Has Donald Trump Been Targeted Full Timeline of Attacks Revealed

హంతక ముఠాల దాడులు కొత్తేమీ కాదు: ట్రంప్

ఘటన జరిగిన కొద్దిసేపటికే వైట్‌హౌస్ ప్రెస్ బ్రీఫింగ్ రూమ్ నుంచి ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన గత స్మృతులను గుర్తు చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. "మన రిపబ్లిక్‌పై హంతకులు దాడికి ప్రయత్నించడం గత రెండేళ్లలో ఇది మొదటిసారి కాదు. కానీ ఇలాంటి క్లిష్ట సమయంలో అందరూ ఏకమవ్వడం ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు. భయానక వాతావరణంలోనూ అక్కడ 'అపారమైన ప్రేమ, ఐక్యత' కనిపించిందని, మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించిందని ఆయన ప్రశంసించారు.

టేబుల్ కింద తలదాచుకున్న ట్రంప్: గాభరా పడ్డ మెలానియా
టేబుల్ కింద తలదాచుకున్న ట్రంప్: గాభరా పడ్డ మెలానియా

మృత్యువును జయించి.. అజేయుడిగా!

డొనాల్డ్ ట్రంప్‌ను మృత్యువు నీడలా వెంటాడుతున్నప్పటికీ, ఆయన ప్రతిసారీ సురక్షితంగా బయటపడటం గమనార్హం. గత దశాబ్ద కాలంలో ఆయనపై జరిగిన ప్రధాన దాడుల చరిత్ర ఇలా ఉంది..

  • 2024 బట్లర్ ర్యాలీ: పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ప్రసంగిస్తుండగా దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవిని తాకుతూ వెళ్ళింది. తృటిలో ప్రాణాపాయం తప్పింది.
  • 2024 మార్-ఎ-లాగో ఘటన: ఫ్లోరిడాలోని తన గోల్ఫ్ కోర్సు వద్ద ఒక సాయుధ నిందితుడు మాటువేసి ఉండగా సీక్రెట్ సర్వీస్ అడ్డుకుంది. ఇది రెండవ హత్యాయత్నంగా రికార్డైంది.
  • 2017 ఫోర్క్‌లిఫ్ట్ పథకం: నార్త్ డకోటాలో అధ్యక్షుడి కాన్వాయ్‌ను ఫోర్క్‌లిఫ్ట్‌తో ఢీకొట్టి హతమార్చాలని గ్రెగొరీ లీ అనే వ్యక్తి చేసిన ప్రయత్నం విఫలమైంది.
  • 2016 లాస్ వెగాస్ ప్రయత్నం: ఎన్నికల ప్రచారంలో ఒక వ్యక్తి పోలీసు అధికారి తుపాకీని లాక్కుని ట్రంప్‌ను కాల్చాలని ప్రయత్నించి పట్టుబడ్డాడు.

తాజా వాషింగ్టన్ ఘటన అమెరికా భద్రతా వైఫల్యాలపై మరోసారి చర్చకు దారితీసింది. వరుస దాడులు జరుగుతున్నా ట్రంప్ తన పంథాను మార్చుకోకుండా ప్రజల్లోకి వెళ్తుండటం ఆయన మద్దతుదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

వైట్ హౌస్ డిన్నర్ లో భారీ ఫైరింగ్: హుటాహుటిన ట్రంప్ తరలింపు
వైట్ హౌస్ డిన్నర్ లో భారీ ఫైరింగ్: హుటాహుటిన ట్రంప్ తరలింపు

హోటల్ సెక్యూరిటీ గుప్పిట్లోకి..

మరోవైపు, కాల్పుల ఘటన తర్వాత అగ్రరాజ్యం అప్రమత్తమైంది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే రంగంలోకి దిగి హోటల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్పడిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ట్రంప్ లక్ష్యంగానే ఈ దాడి జరిగిందా? లేక మరేదైనా కోణం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు సంస్థలు విచారణ వేగవంతం చేశాయి. ఒక అంతర్జాతీయ నేత పాల్గొన్న కార్యక్రమంలోనే ఇంతటి భద్రతా వైఫల్యం కలగడంపై అమెరికాలో తీవ్ర చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+