అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక హెచ్ 1బీ (H-1B) వీసాలు, గ్రీన్ కార్డుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు ఓ గుడ్ న్యూస్. హెచ్1బీ వీసాదారులు గ్రీన్ కార్డుల కోసం ఎదుర్కొంటున్న సుదీర్ఘ నిరీక్షణలకు, ఉపాధి ఆధారిత వలస అడ్డంకులకు చెక్ పెడుతూ కాంగ్రెస్ లో డెమోక్రాట్లు ఓ బిల్లు ప్రవేశపెట్టారు. త్వరలో దీనికి ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇది భారతీయ హెచ్ 1బీ వీసాదారులకు మరింత సులువుగా గ్రీన్ కార్డులు పొందేందుకు వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.
US-Iran Talks: ట్రంప్ కు ఇరాన్ ఝలక్- యుద్ధం ఆపేశాక ఇదే తొలిసారి..!
అమెరికాలో సుదీర్ఘకాలంగా నివసిస్తున్న విదేశీయులు శాశ్వత నివాసం పొందేందుకు వీలుగా ఓ కొత్త అవకాశం కల్పించేందుకు వీలుగా కాలిఫోర్నియా డెమోక్రాట్ సెనేటర్ సెనేటర్ అలెక్స్ పడిల్లా ఓ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్టం ఆమోదం పొందితే అమెరికాలో కనీసం ఏడు సంవత్సరాలు నిరంతరాయంగా నివసించిన వలసదారులు.. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. 1986 నుంచి అప్ డేట్ చేయని వలస నిబంధనల్ని ఈ కొత్త బిల్లు అప్ డేట్ చేయనుంది. దీనివల్ల ఎనభై లక్షల మందికి పైగా ప్రయోజనం పొందుతారని సెనేటర్ పడిల్లా తెలిపారు.
1929 వలస చట్టంలోని వలసల పునరుద్ధరణ నిబంధనలు కనీసం ఏడు సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తున్న వలసదారులను చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తాయి. ఇందుకోసం దరఖాస్తుదారులకు ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. గ్రీన్ కార్డ్ కోసం ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర అర్హతా అవసరాలను కూడా వారు తీర్చవలసి ఉంటుంది. దీని వల్ల డ్రీమర్స్, తాత్కాలిక రక్షిత హోదా కలిగినవారు, అత్యవసర కార్మికులు, దీర్ఘకాల వీసాదారుల పిల్లలకు ప్రయోజనం ఉంటుంది. ఇది ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్‌ల కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న హెచ్1బీ వీసాదారులతో సహా అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులకు కూడా ఉపయోగపడుతుంది. అత్యధిక సంఖ్యలో ఉన్న భారతీయ హెచ్1బీ వీసాదారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అంచనా.US Visa: అమెరికా వీసా రూల్స్ లో భారీ మార్పు- ఇకపై వీరందరికీ షాకులే..!