దేశవ్యాప్తంగా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు.. ద్రవ్యోల్బణం అంచులో..!!
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. రెండు నెలలుగా ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం అలాగే కొనసాగుతోంది. యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసి వేసింది. దాంతో ప్రపంచదేశాలు చమురు, గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే అనేక దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. మరికొన్ని దేశాల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇప్పుడు ఆ లిస్టులోని కువైట్ వచ్చి చేరింది. హార్మూజ్ జలసంధిని మూసివేసిన నేపథ్యంలో కువైట్ సంచలన నిర్ణయం తీసుకుంది. చమురు, గ్యాస్ ఎగుమతులపై స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కువైట్ సంచలన నిర్ణయం తీసుకుంది. చమురు, గ్యాస్ ఎగుమతులపై స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించింది. హార్మూజ్ జలసంధి గుండా చమురు రవాణాకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హార్మూజ్ జలసంధిలో ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కువైట్ తన చమురు సరఫరాపై 'ఫోర్స్ మెజ్యూర్' అంటే అనివార్య, అవాంఛనీయ కారణాల వల్ల ఒప్పందాలను అమలు చేయలేకపోవడం అని అక్కడి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ఇక చమురు అవసరాల కోసం భారత్.. గల్ఫ్ దేశాలపై అధికంగా ఆధారపడుతోంది. ఈ క్రమంలోనే కువైట్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం భారత్ కు బిగ్ షాక్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే భారత్ లో భవిష్యత్తులో ద్రవ్యోల్బణం పెరిగిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. అలాగే చమురు దిగుమతుల కోసం భారత్ చేసే ఖర్చు పెరుగుతోందని దానివల్ల రూపాయి విలువ పడిపోవడం అలాగే ఆర్థిక వ్యవస్థపై ఇప్పుడున్న దానికంటే అదనపు భారం పడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు తమ విశ్లేషణలో వెల్లడిస్తున్నారు.

ఇక ఇటీవల పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అయితే దాదాపు 21 గంటల పాటు జరిగిన ఈ చర్చలు విఫలం అయ్యాయి. దాంతో ఈరోజు(ఏప్రిల్ 21) నుంచి రెండో దశ శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే రెండో విడత చర్చలపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో శాంతి చర్చలు జరుగుతాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications