Maharashtra TET 2026 Exam Leak: "విద్యార్థుల భవిష్యత్తును దొంగిలించడమే"

ఇటీవల నీట్ పేపర్ లీక్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్రలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పేపర్ లీక్ అయిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరీక్షకు ఒక్క రోజు ముందు పేపర్ లీక్ కావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసేందుకు సిట్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు.

థానే జాయింట్ పోలీస్ కమిషనర్ పంజాబ్ రావ్ ఉగాలే, జోన్ 2 డీసీపీ పవన్ బన్సోద్,
ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు , ఒక సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ పోలీస్ ఇన్ స్పెక్టర్స్, పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్స్ లతో కూడిన సిట్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు పేపర్ లీక్ ఘటనపై కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలోని విద్యా వ్యవస్థను దోపిడీ వ్యవస్థగా మార్చేశారని సంచలన ఆరోపణలు చేశారు. పేపర్ లీక్​ వల్ల యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

RahulGandhi Slams Maharashtra TET Paper Leak Chief Minister Orders SIT Investigation Into Scandal

ఈ మేరకు రాహుల్ గాంధీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఇలా పోస్టు చేశారు. "మరో పేపర్ లీక్ అయింది. మరో పరీక్ష రద్దు అయింది. ఈసారి మహారాష్ట్రలో టెట్ పరీక్ష. దేశంలోని విద్యావ్యవస్థ, పరీక్ష నిర్వహణ వ్యవస్థ ఒక దోపిడీ వ్యవస్థగా మారింది. దాంతో దేశంలోని యువత అభద్రతాభావంతో ఉంది. ఇది పేపర్ లీక్ కాదు. యువత భవిష్యత్తును కొల్లగొట్టడం" అంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ఇక ఇదే వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి పరీక్షలు నిర్వహించే సత్తా లేదని విమర్శించారు. పార్టీల్ని విడదీయడం, ఎంపీలను, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మీదే దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. పేపర్లు లీక్ చేయడానికి దేశంలో ఇంకా ఏమైనా పరీక్షలు మిగిలి ఉన్నాయా.. అని ఆయన ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+