గతేడాది మే లో భారత్ కు షాక్ ఇచ్చాం.. అయినా: పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

భారత్ పై మరోసారి విషం చిమ్మింది పాకిస్థాన్. సరిహద్దు దేశమైన పాకిస్థాన్ ఇప్పటికే అనేక సార్లు భారత్ పై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. దాడులు జరిగిన ప్రతిసారి భారత్.. ఆ దేశ కుట్రలను బలంగా తిప్పికొట్టింది. గతేడాది జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పాకిస్థాన్ కు చెందిన ఉగ్రమూకలు జరిపిన మారణహోమంలో 25 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి దాయాది దేశానికి గట్టిగా బుద్ధి చెప్పింది. అంతేకాక ఆదేశంపై వాణిజ్య పరంగా కూడా ఆంక్షలు విధించింది. అయితే పాకిస్థాన్ మాత్రం భారత్ పై విషం చిమ్ముతూ వస్తోంది.

తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ను అస్థిరపరిచేందుకు భారత్ కుట్ర చేస్తోందని ఈ మేరకు టెర్రరిస్టు గ్రూప్స్ తో కలిసి పాకిస్థాన్ లో దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. అఫ్గానిస్తాన్, పాకిస్థాన్ లోని అనేక టెర్రరిస్టు సంస్థలకు భారత్ నుంచి సాయం అందుతోందని.. ఈ మేరకు వాళ్లను పాకిస్థాన్ పై భారత్ ఉసిగొల్పుతోందని అన్నారు. పాకిస్థానీ మీడియా సమాచారం ప్రకారం ఇవాళ కరాచీలో మాట్లాడుతూ భారత్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు షెహబాజ్ షరీఫ్.

" పాకిస్థాన్ కు ఇంటర్నల్ అలాగే ఎక్స్ టర్నల్ గా తీవ్ర ముప్పు పొంచి ఉంది. పాకిస్థాన్ లో ఘర్షణలు, భద్రతా సవాళ్లు ఉన్నాయి. ఇటీవలికాలంలో ఈ దాడులు ఎక్కువ అయ్యాయి. మన సైన్యం ఆందోళనతో ఉంది. అఫ్గానిస్తాన్ వైపు నుంచి విదేశీ సపోర్ట్ తో టెర్రరిజం పెరుగుతోంది. ఈ సమయంలో పాకిస్థాన్ ప్రజలు మన సైన్యానికి సపోర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా భారత్.. పాకిస్థాన్ ను అస్థిర పరిచేందుకు యత్నిస్తోంది. గతేడాది మేలో వాళ్లకు(భారత్) షాక్ ఇచ్చాం. ఇప్పుడు మన నేలపై విధ్వంసం సృష్టిస్తోంది. మన దేశంలో శాంతి, సుస్థిరతకు విఘాతం కలిగించాలని ఆ దేశం చూస్తోంది" అని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇక అంతర్జాతీయ మీడియేషన్ పరంగా పాకిస్థాన్ బలపడిందని షెహబాజ్ అన్నారు. అమెరికా- ఇరాన్ మధ్య శాంతిని చేకూర్చడంలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషించిందని.. తద్వారా పాకిస్థాన్ శాంతిదూతగా ఆవిర్భవించిందని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. మరోవైపు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ మాట్లాడుతూ.. అఫ్గానిస్తాన్ కు భారత్ మిలిటరీ సాయం చేస్తోందని ఆరోపించారు. భారత్ చేరవేసిన డ్రోన్ లతో అఫ్గానిస్తాన్.. పాకిస్థాన్ పై దాడులకు పాల్పడుతోందని అన్నారు.

Shehbaz Sharif Lashes Out India Alleges Conspiracy to Destabilize Pakistan Using Terrorists India

ఇక పాకిస్థాన్ లోని ఖైబర్ పంఖ్తుక్వా, బెలూచిస్తాన్ లోని కొన్ని ఇన్ సర్జెంట్ దళాలు పాకిస్థాన్ లోని ఆర్మీ, ప్రభుత్వ అధికారులపై దాడులు పాల్పడుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం తప్పిదాలతోనే ఈ గ్రూప్ లు యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. అయితే పాకిస్థాన్ మాత్రం తన తప్పులను ఒప్పుకోకుండా భారత్ పై ఆరోపణలు చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+