El Nino: పసిఫిక్ లో మొదలైన ఎఫెక్ట్-డిసెంబర్ కల్లా తీవ్ర రూపం ? తాజా రిపోర్ట్..!

ఈ ఏడాది వాతావరణ శాస్త్రవేత్తలు ఊహించినట్లే పసిఫిక్ మహా సముద్రంలో ఎల్ నినో (EL Nino)ప్రభావం మొదలైంది. అంతే కాదు ఇది క్రమంగా బలపడుతోంది. దీని వల్ల ప్రపంచ వాతావరణ పరిస్ధితుల్లో పెనుమార్పులు తప్పేలా లేవు. ముఖ్యంగా వివిధ దేశాల్లో రుతుపవనాలు, ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఒకే విధంగా ఉండవు. ఆయా దేశాల్లో వాతావరణ పరిస్ధితుల ఆధారంగా కూడా ఉండబోతున్నాయి. దీంతో భారత్ సహా పలు దేశాలు ఎల్ నినో ప్రభావాన్ని నిశితంగా గమనిస్తున్నాయి.

పసిఫిక్ మహాసముద్రంలో తాజాగా ఎల్ నినో తీవ్రత వేగంగా పెరుగుతోంది. ఇది ఈ ఏడాది డిసెంబర్ నాటికి అత్యంత బలమైన వాతావరణ పరిణామంగా మారడానికి 90 శాతానికి పైగా అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణమని అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక వాతావరణ పరిశోధనా సంస్థ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏకంగా 2 డిగ్రీల సెల్సియస్ అదనంగా నమోదవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల కేవలం సముద్ర ఉపరితలానికే పరిమితం కాకుండా, లోతైన పొరల్లోకి కూడా విస్తరిస్తోంది.

El Nino Set to Strengthen Further 90 Chance of Powerful Phase by 2026-End
Monsoon: బంగాళాఖాతంలో మొదలైన గర్జన ..! ఇక ఆగస్టు అంతా పండగే..!
Monsoon: బంగాళాఖాతంలో మొదలైన గర్జన ..! ఇక ఆగస్టు అంతా పండగే..!

ఇది ఎల్ నినో మరింత తీవ్రరూపం దాల్చడానికి అవసరమైన అదనపు శక్తిని అందిస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్త వాతావరణ వ్యవస్థల్లో పెను మార్పులు తప్పేలా లేవు. ఈసారి ఏర్పడబోయే ఎల్ నినో అత్యంత శక్తివంతమైన చారిత్రక వాతావరణ పరిణామంగా మారేందుకు 69 శాతం అవకాశం ఉందని నిపుణులు తేల్చారు. ఒకవేళ ఇదే జరిగితే, ఆధునిక వాతావరణ పరిశీలనలు ప్రారంభమైన 1950 సంవత్సరం రికార్డుల తర్వాత నమోదైన అత్యంత బలమైన ఎల్ నినోలతో ఇది పోటీ పడవచ్చు.

El Nino Set to Strengthen Further 90 Chance of Powerful Phase by 2026-End
Super El Nino :
Super El Nino :

దీని ప్రభావంతో ఇప్పటికే పసిఫిక్ భూమధ్యరేఖ పరివాహక ప్రాంతాల్లో గాలుల దిశలు మారిపోవడంతో పాటు వర్షపాత విధానంలో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఎల్ నినో బలపడినప్పుడు పసిఫిక్ తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలు పడగా, ఇండోనేషియా వంటి ఆసియా ప్రాంతాల్లో తీవ్రమైన పొడి వాతావరణం, కరువు పరిస్థితులు నెలకొంటాయి. ఈ పరిణామాలు సాగు రంగానికి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉన్నందున భారత్ వంటి దేశాలు కూడా ఈ మార్పులపై ఆందోళన చెందుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+