స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో త్రిష స్పెషల్ అట్రాక్షన్.. విజయ్ తల్లిదండ్రులతో కలిసి..
తమిళనాడులోని చెన్నైలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రముఖ సినీ నటి త్రిష సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తమిళనాడు సీఎం విజయ్ తల్లిదండ్రులతో ఆమె కనిపించారు. విజయ్ పేరెంట్స్ ను ఆప్యాయంగా పలకరించారు. అలా కొద్దిసేపు మాట్లాడుకున్నారు. త్రిష, విజయ్ తల్లిదండ్రులతో కలిసి ఉన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వీక్షకుల గ్యాలరీలో ముందు వరుసలో కూర్చొన్న సీఎం విజయ్ తల్లిదండ్రులు ఎస్ ఏ చంద్రశేఖర్, శోభ చంద్రశేఖర్ ల పక్కనే నటి త్రిష కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. త్రిషను చూసిన అభిమానులు కేరింతలు కొడుతూ చేతులు ఊపారు. అక్కడి అధికారులను త్రిష నవ్వుతూ పలకరించారు. గతంలో సీఎం విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలోనూ నటి త్రిష సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సీఎం విజయ్ సతీమణి సంగీత, పిల్లలు దూరంగా ఉన్నారు. కానీ త్రిష మాత్రం విజయ్ తల్లిదండ్రులతోనే ఉన్నారు.
ఇక ఇటీవల నటి త్రిష సినీ, రాజకీయంగా పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె చేసిన పోస్టు సంచలనంగా మారింది. "ఈ వయసులోనూ ఇంత నాటకం సిగ్గు చేటు. పోయి డబ్బు సంపాదించి ప్రశాంతంగా జీవించండి" అని త్రిష రాసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. త్రిష మాటల్లో అర్థం ఏంటి..? ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు..? అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

సీఎం విజయ్ భార్యకే ఆమె చురకలు అంటించినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలాఉండగా తమిళనాట త్రిష- విజయ్ వ్యవహారం ముదురుతున్న వేళ త్రిషను డిప్యూటీ సీఎం ఎప్పుడు చేస్తారంటూ అన్నాడీఎంకేకు చెందిన ఓ మాజీ మంత్రి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినిమా రంగంలోని వారికే ప్రభుత్వ పదవులు కట్టబెడుతున్నారని సీఎం విజయ్ పై ఆయన కీలక ఆరోపణలు చేశారు. అటు డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సైతం ఇటీవల త్రిషపై డబుల్ మీనింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications