"వాళ్లే తప్పు ఒప్పుకున్నారు సార్.."- జగన్ తర్వాత చంద్రబాబుకూ టీఎంసీ ఎంపీ ట్వీట్..!
కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్లకు తెలియకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక బయటపెట్టిన తర్వాత.. అబ్బే అదేం లేదంటూ ఈసీలో ముగ్గురు కమిషనర్లు కలిసి ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. దీంతో అప్పటివరకూ ఈ వివాదంపై వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన ఎన్డీయే మిత్రపక్షం టీడీపీ ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఈసీ వివరణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో, ఎన్నికల కమిషనర్లు ఎస్.ఎస్.సంధు, వివేక్ జోషిలతో కలిసి ఎన్నికల సంఘం జారీ చేసిన ఏకగ్రీవ వివరణ, మన రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను పునరుద్ఘాటిస్తుందని, దాని చుట్టూ ఉన్న అన్ని అపోహలకు నివృత్తి చేస్తుందని చంద్రబాబు తెలిపారు.ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా, సంస్థాగత నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ తీసుకోబడతాయన్నారు. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై లేదా ఎన్నికల ప్రక్రియలపై ప్రపంచ విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు అత్యంత దురదృష్టకరమన్నారు.

Sir - they have admitted guilt. It was an admission more than any clarification. https://t.co/4Qto3BaNa2
— Mahua Moitra (@MahuaMoitra) September 26, 2026
ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయని, పటిష్టమైన ప్రజాస్వామ్యంలో, నాయకత్వం అంటే గెలుపు ఓటములను రెండింటినీ హుందాగా, వినయంతో స్వీకరించడం కూడా అంటూ జగన్ కు చురకలు అంటించారు. మన రాజ్యాంగ సంస్థల పట్ల గౌరవం అత్యంత ముఖ్యం. భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతమైన నాయకులందరి సమిష్టి బాధ్యత అని కూడా చంద్రబాబు తేల్చేశారు. దీనిపై స్పందించిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) .. సార్ .. వాళ్లు తప్పు ఒప్పుకున్నారు.. అది వివరణ కంటే కూడా ప్రధానంగా ఒప్పుకోలే అంటూ ట్వీట్ చేశారు. ఇదే మహువా.. అంతకు ముందు జగన్ ఈసీని తప్పుబడుతూ చేసిన ట్వీట్ పైనా స్పందిస్తూ.. ముందు మీరు ఎన్టీయే ప్రభుత్వానికి మద్దతివ్వకండి సార్ అంటూ చురకలు అంటించారు.
So stop supporting this govt on all issues. Stop your MPs from backing Delimitation. Don’t back the very people who have destroyed institutions & then play to the gallery, Sir! https://t.co/BcoPP6NwuF
— Mahua Moitra (@MahuaMoitra) September 25, 2026














Click it and Unblock the Notifications
