కోర్టులు కాదు.. ఇక తేల్చాల్సింది ప్రజలే ..! సీఈసీపై కాక్రోచ్ లు ఫిక్స్..!
కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు, అరెస్ట్ కు విపక్షాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు ఆయనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుతో పాటు వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఇంకోవైపు సీఈసీ రాజీనామాకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఇచ్చిన 48 గంటల డెడ్ లైన్ ముగిసిపోయింది. దీంతో గాంధీ జయంతి రోజున సీఈసీ రాజీనామా కోసం భారీ ఉద్యమం చేపట్టేందుకు కాక్రోచ్ లు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఈసీ వివాదంపై స్పందిస్తూ సౌరవ్ దాస్ ఇవాళ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చర్యలకు వ్యతిరేకంగా ఇప్పుడు హైకోర్టులలో, సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలవుతున్నాయని, కానీ, పౌరులు చివరిసారిగా న్యాయవ్యవస్థ తలుపులు తట్టినప్పుడు ఏం జరిగిందో మనం మర్చిపోకూడదన్నారు. ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు, బెంగాల్‌లో ఎలాగైనా సరే ఎస్ఐఆర్ జరిగేలా సుప్రీంకోర్టు చూసిందన్నారు. పెద్ద సంఖ్యలో ఓటర్ల తొలగింపుల పరిణామాలను విస్మరించడం అసాధ్యమైనప్పుడు, ఆ ధర్మాసనంలోని జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి... ఈసారి ఓటు వేయలేని వారు వచ్చేసారి ఓటు వేయవచ్చని ఒక అసాధారణమైన వ్యాఖ్య చేశారని సౌరవ్ దాస్ గుర్తుచేశారు.

🚨#Important: Several petitions are now being filed in the High Courts and the Supreme Court “against” the actions of Chief Election Commissioner Gyanesh Kumar.
— Saurav Das (@SauravDassss) September 28, 2026
But we must not forget what happened the last time citizens knocked on the doors of the judiciary. The Supreme Court…
బహుశా దొంగిలించిన ఎన్నికకు వచ్చేసారి అనే అవకాశం ఉండదని ఆయనకు ఎవరు చెప్పగలరని సౌరవ్ దాస్ ప్రశ్నించారు.
న్యాయస్థానాలు రాజ్యాంగబద్ధమైన సంస్థలు కాబట్టి, జ్ఞానేష్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఈ కొత్త పిటిషన్లను వారు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు విచారించనివ్వాలన్నారు. వారు ఎలాంటి ఉత్తర్వులైనా జారీ చేయనివ్వాలన్నారు. కానీ, జ్ఞానేష్ కుమార్ జవాబుదారీతనం కోసం తమ ప్రజాస్వామ్యయుతమైన డిమాండ్‌ను న్యాయస్థానాలకు అప్పగించబోమన్నారు. దీన్ని ప్రజలే నిర్ణయిస్తారని తేల్చిచెప్పారు. ఎందుకంటే అంతిమంగా, భారత ప్రజాస్వామ్యం ఏ ఎన్నికల కమిషనర్‌కు గానీ, ఏ న్యాయమూర్తికి గానీ సొంతం కాదని, అది మన ప్రజలకే సొంతమని స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications
