ముంచుకొస్తున్న మరో వాయుగుండం - ఈ జిల్లాల్లో ఇక కుండపోత...!!
వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎల్ నినో ప్రభావంతో వర్షాల కోసం ఎదురు చూస్తున్న టైం లో గత వారం కొంత మేర ఉపశమనం దక్కింది. వాయుగుండం ప్రభావంతో కురిసన వర్షాలతో పలు వాగుల్లోకి నీరు చేరింది. రైతులకు కొంత మేర రిలీఫ్ ఇచ్చింది. కాగా.. ఇప్పుడు మరో వాయు గుండం ఏర్పడినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో పలు జిల్లాలకు మరోసారి భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వెల్లడించింది.
ఏపీలో భారీ వర్షాల పై వాతావరణ శాఖ కీలక సమాచారం ఇచ్చింది. బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. మయన్మార్ - అండమాన్ మధ్య ఇది ఏర్పడినట్లు వాతావరణశాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని పేర్కొంది. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. గత వారం కళింగపట్నం వద్ద తీరం దాటిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. తాజా వాయుగుండం కారణంగా అల్లూరి, ఏలూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.

వాతావరణ శాఖ తాజా అంచనాలు
పలు జిల్లాల్లో 24 గంటల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వర్షాలకు ఉత్తరాంధ్ర సహా గోదావరి జిల్లాల్లో ఉన్న నదుల్లోకి భారీగా నీరు చేరే అవకాశం ఉందని పేర్కొంది. ఇక. గడిచిన 24 గంటల్లో విశాఖలో భారీగా వర్షపాతం నమోదు అయింది. అదే విధంగా బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం ప్రభావంతో ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.













Click it and Unblock the Notifications
