సర్వనాశనం.. శోకాన్ని మిగిల్చిన సోమవారం! మార్కెట్ క్రాష్ వెనుక కారణాలు..

దేశీయ స్టాక్ మార్కెట్లకు ఈ వారం ప్రారంభమే ఘోరమైన పరాభవంతో ఎదురైంది. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులు, ముడి చమురు ధరల భయాలు, విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాల ఒత్తిడితో దలాల్ స్ట్రీట్ తీవ్ర నష్టాల బారిన పడింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లకు పైగా పతనమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా కీలకమైన 22,900 మార్క్ దిగువకు పడిపోయి ఇన్వెస్టర్లను హడలెత్తించింది. వరుసగా ఏడు సెషన్లుగా నష్టాలను చవిచూస్తున్న మార్కెట్లలో ఈ తాజా పతనం మదుపర్ల సంపదను హారతి కర్పూరంలా కరిగించేసింది.

ఆవిరైన రూ. 6 లక్షల కోట్ల మదుపర్ల సంపద

మార్కెట్‌లో నెలకొన్న ఈ తీవ్ర విక్రయాల హోరు కారణంగా బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కసారిగా కుప్పకూలింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు రూ. 6 లక్షల కోట్ల సంపద ఆవిరైపోవడంతో మదుపర్లు లబోదిబోమంటున్నారు. మార్కెట్ ప్రారంభమైన గంటలోపే సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల షేర్లు నష్టాల బాటలోనే పయనించడం గమనార్హం. గత వారమంతా నష్టాలతోనే ముగిసిన మార్కెట్లు, ఈవారూ అదే పంథాను కొనసాగించడం ఇన్వెస్టర్లలో గుబులు పుట్టిస్తోంది.

Dalal Street Bloodbath Sensex Tumbles Over 1000 Points and Nifty Falls Below 22900 Amid Oil Pressures

భగ్గుమంటున్న క్రూడాయిడ్ ధరలు..

ఈ భారీ పతనానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ పెరుగుతున్న ముడి చమురు ధరలే. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 106 డాలర్లకు పైగా ఎగబాకడంతో మార్కెట్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి వద్ద ఏడు నెలలుగా కొనసాగుతున్న రవాణా అంతరాయాలు చమురు మంటలను రాజేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ శాంతి ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడంతో సంక్షోభం మరింత ముదిరింది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతి దేశమైన భారత్‌పై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది.

Market Crash: భీభత్సం సృష్టిస్తున్న ఇన్సూరెన్స్ రూల్స్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
Market Crash: భీభత్సం సృష్టిస్తున్న ఇన్సూరెన్స్ రూల్స్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

వెనక్కి తగ్గేదే లే అంటున్న విదేశీ ఇన్వెస్టర్లు (FIIs)

స్థానిక మార్కెట్ల పతనానికి విదేశీ సంస్థాగత మదుపర్ల (FII) అమ్మకాలు కూడా మరో ప్రధాన కారణాంగా నిలిచాయి. సెప్టెంబర్ నెల ఒక్క నెలలోనే వారు వేల కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించగా, ఈ ఏడాదిలో వారి మొత్తం అమ్మకాల విలువ 25 బిలియన్ డాలర్లకు చేరుకుంది. విదేశీ మదుపర్లు మన మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటంతో రూపాయి విలువపై కూడా తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలహీనపడుతుండటం ఆర్థిక నిపుణులను కలవరపెడుతోంది.

లక్ష పెడితే 5 నిమిషాల్లో రూ. 44 లక్షలు? సెన్సెక్స్‌లో అసలేం జరిగింది?
లక్ష పెడితే 5 నిమిషాల్లో రూ. 44 లక్షలు? సెన్సెక్స్‌లో అసలేం జరిగింది?

రానున్న రోజుల్లో మార్కెట్ దిశానిర్దేశం ఎలా ఉండబోతోంది?

ప్రస్తుత అస్థిర పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో వెలువడే ఆర్థిక గణాంకాలే మార్కెట్ గమనాన్ని నిర్ణయించనున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలు, అంతర్జాతీయ బాండ్ ఈల్డ్స్, దేశీయంగా తయారీ రంగ పీఎంఐ గణాంకాలు, ఆటోమొబైల్ అమ్మపాల డేటా మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గి చమురు ధరలు అదుపులోకి వస్తేనే తప్ప మార్కెట్లు కోలుకునే అవకాశం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మదుపర్లు అప్రమత్తంగా ఉండాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+