ఒంగోలుకు జగన్, ముఖ్య నేతలకు పిలుపు - కీలక నిర్ణయాలు..!!

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. స్థానిక ఎన్నికలకు అటు కూటమి.. ఇటు వైసీపీ సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేసాయి. మాజీ సీఎం జగన్ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రతీ చోట పోటీ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. కాగా.. ఇప్పుడు జగన్ జిల్లాలు.. నియోజకవర్గాల వారీగా బాధ్యులను మార్పు చేస్తున్నారు. ఇక.. ఇప్పుడు జగన్ ఒంగోలు పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. కీలక నిర్ణయాలకు జగన్ సిద్దం అవుతున్నారు.

మాజీ సీఎం జగన్ రేపు (మంగళవారం) ఒంగోలులో పర్యటించనున్నారు. ఇటీవల మరణించిన పార్టీ నేత కాకుమాను రాజేశేఖర్ కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. విజయవాడలో శాప్ కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్న రాజశేఖర్ అక్కడ చోటు చేసుకున్న పరిణామాలకు ఒత్తిడికి గురయ్యారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా, జగన్ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ స్థలాలను పార్టీ నేతలు పరిశీలించారు. ఈ ఏర్పాట్లపై వైయస్సార్సీపీ ప్రకాశం జిల్లా శ్రేణులు సమీక్షించాయి. జగన్ చాలా కాలం తరువాత ఒంగోలుకు వస్తున్న వేళ పెద్ద ఎత్తున పార్టీ కేడర్ తరలి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో, అటు పోలీసులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.

వచ్చేది మన ప్రభుత్వమే - వంగవీటి ఆశా కిరణ్ సంచలనం..!!
వచ్చేది మన ప్రభుత్వమే - వంగవీటి ఆశా కిరణ్ సంచలనం..!!
jagan-s-ongole-visit-confirmed-to-meet-family-of-late-ycp-leader-kakumanu-rajasekhar-here-the-deta

స్థానిక ఎన్నికల పై జగన్ దిశా నిర్దేశం

కాగా.. జగన్ ఈ నెల 30న పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చే వారం విడుదల కానుండటంతో.. నేతలకు కీలక దిశా నిర్దేశం చేయనున్నారు. రిజర్వేషన్ల ఖరారు.. అభ్యర్ధుల ఖరారుతో పాటుగా ఎన్నికల వ్యూహాల పైన స్పష్టత ఇవ్వనున్నారని పార్టీ నేతల సమాచారం. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నిక విధానంలో పోలింగ్ జరగనుండటం తో పార్టీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగన్ సూచిస్తున్నారు. బలమైన అభ్యర్ధిని మేయర్, మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్దిగా బరిలో నిలపటం ద్వారా పోటీలో ఉన్న కార్పోరేటర్, కౌన్సిలర్ అభ్యర్ధులకు సైతం కలిసి వస్తుందని చెబుతున్నారు. రిజర్వేషన్ల ఖరారు ఆధారంగా స్థానిక నేతలకు ప్రాధాన్యత ఇస్తూ సీట్లు కేటాయించాలని జగన్ నిర్దేశించారు. అదే విధంగా పలు కీలక నియోజకవర్గాల్లో సమన్వయకర్తల నియామకం పైనా జగన్ కసరత్తు చేస్తున్నారు. పార్టీలోనూ సమూల ప్రక్షాళన దిశగా ఆలోచన జరుగుతోందని సమాచారం. దసరా వేళ పార్టీలో కీలక మార్పుల పైన ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+