ఫుడ్‌ ప్యాకెట్ మీద రెడ్ మార్క్.. నాన్-వెజ్ అనుకుంటే పొరపాటే!

ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) త్వరలో తీసుకొస్తున్న కొత్త నిబంధనలపై వివాదం ముదురుతోంది. చిప్స్, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ వంటి జంక్ ఫుడ్‌లో ఉప్పు, చక్కెర లేదా కొవ్వు పదార్థాలు మోతాదుకు మించి ఉంటే ప్యాకెట్ ముందు భాగంలో 'ఎరుపు రంగు షట్కోణ' (Red Hexagon) హెచ్చరిక లేబుల్ ముద్రించాలనే నిబంధనను ఫుడ్ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. ఎరుపు రంగును చూడగానే భారతీయులు దానిని నాన్-వెజ్ ఆహారంగా పొరబడే అవకాశం ఉందని ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

నాన్-వెజ్ గుర్తింపునకు, కొత్త నిబంధనకు గందరగోళం

మన దేశంలో ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం శాఖాహార పదార్ధాలకు ఆకుపచ్చ రంగు గుర్తు, మాంసాహార పదార్ధాలకు బ్రౌన్ లేదా ఎరుపు రంగు గుర్తులు వాడటం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా ఎరుపు రంగు లేదా బ్రౌన్ మార్క్ కనిపిస్తే అది నాన్-వెజ్ అని ప్రజల మెదళ్లలో బలంగా నాటుకుపోయింది. ఇప్పుడు ప్యాకెట్లపై పోషకాల హెచ్చరికల కోసం కూడా ఎరుపు రంగును ఎంపిక చేస్తే సాధారణ వినియోగదారులు తీవ్ర గందరగోళానికి గురవుతారని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై గతంలోనే సుప్రీంకోర్టు కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐని కీలక ప్రశ్నలు అడగడం గమనార్హం.

Food Companies Challenge FSSAI Red Hexagon Warning Label in Supreme Court Over Non-Vegetarian Confusion
FSSAI: ఫుడ్ ప్యాకెట్లపై ఇకపై రెడ్ మార్క్. కొత్త రూల్స్, త్వరలోనే కొత్త చట్టం!
FSSAI: ఫుడ్ ప్యాకెట్లపై ఇకపై రెడ్ మార్క్. కొత్త రూల్స్, త్వరలోనే కొత్త చట్టం!

ఒకే విడతలో అమలుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సన్నాహాలు

మరోవైపు ఈ నిబంధనల అమలు తీరుపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తన ప్రణాళికను మార్చుకుంది. మొదట ఈ హెచ్చరికలను దశలవారీగా అమలు చేయాలని భావించినప్పటికీ, తాజాగా ఒకే విడతలో దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు తెలిపింది. ప్యాకెట్ ముందు భాగంలో ఎడమ వైపు పైభాగంలో ఈ హెచ్చరిక లేబుల్స్ ఉండేలా రూపకల్పన చేస్తున్నారు. ఐసీఎంఆర్ (ICMR) నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా ఈ పోషక పరిమితులను నిర్ణయిస్తున్నారు.

Old Monk అసలు రమ్మే కాదా? నాటు సారాకి మనం తాగే విస్కీకి తేడా లేదా?
ప్యాకేజ్డ్ ఆహారాలపై మరింత స్పష్టమైన హెచ్చరికలు ఉండాలని కోరుతూ '3ఎస్' , 'అవర్ హెల్త్ సొసైటీ' దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ కొత్త లేబులింగ్ విధానంపై స్పష్టమైన విధివిధానాలు, డిజైన్ , అమలు తేదీలను సమర్పించాలని కోర్టు ఇదివరకే ఆదేశించింది. అయితే ఈ ముసాయిదా నిబంధనలు ఇంకా తుది రూపం దాల్చలేదని, చట్టబద్ధమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాతే ఇవి అమల్లోకి వస్తాయని నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+