Old Monk అసలు రమ్మే కాదా? నాటు సారాకి మనం తాగే విస్కీకి తేడా లేదా?

దేశంలోని మద్యం ప్రియుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఒక చేదు నిజం ఇప్పుడు బయటపడింది. ఏళ్ల తరబడి మందు బాబులు ఎంతో ఇష్టంగా తాగే ఐకానిక్ బ్రాండ్ 'ఓల్డ్ మాంక్' అసలు 'రమ్' కానే కాదనే సంచలన విషయాన్ని భారత ఆహార భద్రత- ప్రమాణాల ప్రాధికార సంస్థ FSSAI బాంబే హైకోర్టు వేదికగా వెల్లడించింది. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కేటగిరీకి చెందిన విస్కీలు, రమ్‌లలో మెజారిటీ శాతంలో అసలైన సరుకు లేదని, కేవలం కెమికల్ రసాయనాలు, ఫ్లేవర్స్ కలిపిన మద్యం మాత్రమే అందుబాటులో ఉందనే నిజాన్ని బయటపెట్టడంతో మందుబాబుల గుండెలు పగిలినంత పనైంది.

మొలకల మ్యాజిక్ లేదు.. అంతా ఇథనాల్ మైకం!

ప్రపంచవ్యాప్తంగా విస్కీని బార్లీ, గోధుమలు లేదా ఇతర ధాన్యాలను పులియబెట్టి, నిల్వ చేసి తయారుచేస్తారు. రమ్‌ను చెరకు రసం లేదా మొలాసిస్ నుంచి తయారుచేస్తారు. కానీ మన దేశంలో లభించే అత్యధిక మాస్-మార్కెట్ విస్కీలు, రమ్‌లు ఏవీ ఈ సంప్రదాయ పద్ధతిలో తయారవ్వవు. చక్కెర కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థ పదార్థమైన మొలాసిస్ నుంచి 'ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్' (ENA) అనే ద్రవాన్ని తయారుచేస్తారు. ఇది పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ రకానికి చెందినది. ఈ ఆల్కహాల్‌కు కాస్త రంగు, విస్కీ లేదా రమ్ వాసన ఇచ్చే కృత్రిమ ఫ్లేవర్లు కలిపి బాటిళ్లలో నింపి మార్కెట్లోకి వదులుతున్నారు. అంటే, మన వాళ్లు తాగుతున్నది రమ్ కాదు, 'రమ్ ఫ్లేవర్' ఉన్న ఇథనాల్ మాత్రమే!

Old Monk Is Not Rum Says FSSAI in Bombay High Court Major Shock to Indian Alcohol Consumers Today

కోర్టుకెక్కిన వివాదం.. రోజుకు కోట్లలో నష్టం!

కృత్రిమ రుచులు, వాసనలు కలిపి అసలైన రమ్ లేదా విస్కీ అని లేబుళ్లు వేసి విక్రయించడం వినియోగదారులను మోసం చేయడమేనని FSSAI స్పష్టం చేసింది. ఓల్డ్ మాంక్ ఉత్పత్తిదారులైన మోహన్ మీకిన్ సంస్థ దీనిని రమ్‌గా కాకుండా 'రమ్ ఫ్లేవర్డ్ స్పిరిట్'గా మాత్రమే విక్రయించాలని, లేబుళ్లపై స్పష్టత ఉండాలని ఆదేశించింది. ఈ వివాదం కారణంగా మహారాష్ట్రలో ఓల్డ్ మాంక్ విక్రయాలు నిలిచిపోవడంతో రోజుకు కోటి రూపాయిలకు పైగా నష్టం వాటిల్లుతోంది. ఈ కేసుపై సెప్టెంబర్ 11న బాంబే హైకోర్టులో కీలక విచారణ జరగనుంది.

దేశీ దారు కంటే భిన్నమైనదేం కాదు!

ప్రపంచంలోనే అత్యధికంగా విస్కీ వినియోగించే దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. అయితే మనం తాగే బ్రాండెడ్ IMFL విస్కీలకు, నాటు సారాకి తయారీ విధానంలో పెద్దగా తేడా లేదని నిపుణులు చెబుతున్నారు. రెంటికీ వాడేది బేస్ ఆల్కహాలే! కాకపోతే IMFLలో కాస్త ఆకర్షణీయమైన బాటిళ్లు, విదేశీ పేర్లు, సువాసన కలిపిన ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. స్కాట్లాండ్ లేదా యూరప్‌లో ఏళ్ల తరబడి చెక్క పీపాల్లో నిల్వ ఉంచి తయారుచేసే కష్టమైన ప్రక్రియతో పోలిస్తే.. ఇండియాలో కొద్ది గంటల్లోనే కెమికల్స్ ఉపయోగించి విస్కీలను సిద్ధం చేసేస్తారు.

రూల్స్ మారాలి.. వినియోగదారునికి నిజం తెలియాలి!

ఇండియాలో కోట్లాది రూపాయల మద్యం వ్యాపారం నడుస్తోంది. ఒక్కసారిగా ఈ బ్రాండ్లను నిషేధిస్తే ప్రభుత్వ ఆదాయానికి, పరిశ్రమకు పెద్ద దెబ్బ తగులుతుంది. గతంలో 'బ్రాండీ' విషయంలో కూడా ఇలాంటి సమస్యే ఎదురైనప్పుడు, FSSAI 'ఇండియన్ బ్రాండీ' అనే కొత్త కేటగిరీని తీసుకొచ్చింది. అదే తరహాలో ఇప్పుడు 'ఇండియన్ రమ్' లేదా 'ఇండియన్ విస్కీ' పేరుతో కొత్త నిబంధనలు తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా, మనం గ్లాసులో పోసుకుని తాగే ద్రవంలో అసలు ఏముందో తెలుసుకునే హక్కు ప్రతి వినియోగదారుడికీ ఉందని, బ్రాండ్లు తమ ఉత్పత్తుల విషయంలో పారదర్శకంగా ఉండాలని సగటు మందుబాబులు కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+