మెల్‌బోర్న్‌లో మలైకా కొత్త లవ్ స్టోరీ!

బాలీవుడ్ బ్యాటీ మలైకా అరోరా తన పర్సనల్ లైఫ్, ప్రేమాయణాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ప్రముఖ నటుడు అర్జున్ కపూర్‌తో బ్రేకప్ అయిన అనంతరం ఆమె డైమండ్ వ్యాపారి అయిన హర్ష్ మెహతాతో డేటింగ్ చేస్తోందనే వార్తలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి ప్రత్యక్షమవ్వడంతో వీరి బంధం దాదాపు ఖరారైనట్లేనని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.

ఈ సినిమా ఏంటి బాసూ ఇంత బాగుంది..!
ఈ సినిమా ఏంటి బాసూ ఇంత బాగుంది..!

మెల్‌బోర్న్‌లో ఆకట్టుకున్న జంట
ఓ ప్రత్యేక కార్యక్రమం కోసం మెల్‌బోర్న్ వెళ్లిన మలైకా అరోరా.. అక్కడ తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ హర్ష్ మెహతాతో కలిసి సందడి చేసిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ వీడియోలో డిజైనర్ దుస్తులలో మెరిసిపోతున్న మలైకా అరోరాను ఫోటోగ్రాఫర్లు క్లిక్ చేస్తుండగా.. సూట్ ధరించిన హర్ష్ మెహతా ఎంతో మురిపెంగా తన ఫోన్లో మలైకా ఫోటోలను తీస్తూ కనిపించారు. మరో వీడియోలో అభిమానులు మలైకా అరోరాతో సెల్ఫీల కోసం ఎగబడగా.. హర్ష్ మెహతా ఎంతో ఓపికగా దూరంగా నిలబడి ఆమె కోసం ఎదురుచూడటం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది.

Malaika Arora Spotted with Harsh Mehta in Melbourne Age Gap and Dating Rumors Spark Debate

నెటిజన్ల ప్రశంసలు
వీరిద్దరి కెమిస్ట్రీకి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'చాలా ముచ్చటైన జంట', 'మలైకాకు హర్ష్ లాంటి మంచి భాగస్వామి లభించడం అదృష్టం' అంటూ పలువురు కామెంట్లు పెడుతూ ఈ జంటకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న 19 ఏళ్ల వయస్సు తేడా కారణంగా కొంత మంది నెటిజన్లు మలైకా అరోరాపై తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

Vishwanath and Sons Movie Review: సూర్య సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath and Sons Movie Review: సూర్య సినిమా హిట్టా? ఫట్టా?

ట్రోల్స్‌పై స్పందించిన మలైకా అరోరా
వయసు తేడాపై వచ్చే విమర్శలు, ట్రోలింగ్‌పై మలైకా అరోరా గతంలోనే పలుమార్లు స్పష్టత ఇచ్చారు. ఇతరుల ప్రతికూల కామెంట్లను తాను అస్సలు పట్టించుకోననని.. తనకు నచ్చిన రీతిలోనే జీవితాన్ని గడుపుతానని మలైకా పేర్కొన్నారు. గతంలో అర్బాజ్ ఖాన్ తో విడాకుల అనంతరం సుదీర్ఘకాలం ఓ బంధంలో ఉన్న మలైకా అరోరా.. రెండో పెళ్లి గురించి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+