సైలెంట్‌ గా ఓటీటీలోకి తెలుగు థ్రిల్ల‌ర్ మూవీ.. ఇప్పుడే చూసేయండి..!

తెలుగులో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా.. ఇప్పుడు విలన్ గా.. విలక్షణమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రముఖ నటుడు జగపతిబాబు. కెరీర్ బిగినింగ్ లో హీరోగా ఫ్యామిలీ.. రొమాంటిక్ సినిమాలతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే లెజెండ్ మూవీ నుంచి ఆయన విలన్ పాత్రలు చేయడం ప్రారంభించారు. నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ఈ మూవీలో జగపతి బాబు 'జిత్తూ' గా తన నటవిశ్వరూపం ప్రదర్శించారు. ఈ సినిమా తర్వాత ఆయనకు వరుసగా విలన్ అవకాశాలు క్యూ కట్టాయి. అలా నాన్నకు ప్రేమతో, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో విలన్ గా ప్రేక్షకుల్ని మెప్పించారు జగ్గూ భాయ్.

ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాలోనూ అప్పల సూరి అనే కీలక పాత్రలో నటించి తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ మూవీలో అప్పలసూరిగా జగపతి బాబు జీవించారనే చెప్పాలి. ఈ పాత్రను జగ్గూభాయ్ తప్ప మరెవరూ చేయలేరు అనేంతగా అందులో పరకాయ ప్రవేశం చేశారు. అయితే ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ 'వదలా'.. ఈ మూవీ జూలై 17 న విడుదలైంది. వదలా మూవీకి ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించగా.. కిషోర్ నాయుడు చిరు మామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ సంయుక్తంగా నిర్మించారు.

JagapathiBabu Telugu thriller movie Vadala telugu movie now has quietly arrived on OTT watch it

'వదలా'లో జగపతిబాబు, లయతో పాటు హ్రితిక శ్రీనివాస్, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ గా తెర‌కెక్కిన ఈ మూవీ హిట్టుగా మాత్రం నిల‌వ‌లేక‌పోయింది. రిలీజైన సంగ‌తి ఆడియెన్స్‌ కు తెలిసే లోపే థియేట‌ర్లలో క‌నిపించ‌కుండాపోయింది. అయితే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 14 న శుక్రవారం సైలెంట్ గా ఈ మూవీ ఓటీటీలో ప్రత్యక్షమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. మరి ఓటీటీలో ఈ మూవీని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+