ఏపీలో వైద్యులకు షాక్, 70మంది వైద్యుల తొలగింపు, 193మందిపై చర్యలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో క్రమశిక్షణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. చాలాకాలం అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 70 మంది వైద్యులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన వారు తరచూ హాజరు కాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే పని చెయ్యని, అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న వారిని తొలగించింది.

కేవలం ఈ 70 మందితోనే ఆగకుండా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ దశల్లో గైర్హాజరవుతున్న మరో 193 మంది వైద్యులపై కూడా తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. గతంలో మే నెలలోనే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 51 మంది వైద్యులను విధి నిర్వహణలో అలసత్వం చూపినందుకు తొలగించిన విషయం తెలిసిందే.

AP doctors dismissal Ap govt Dismisses 70 Doctors for Prolonged Absenteeism Orders Action Against 193 More

ఇప్పుడు మళ్లీ కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం ఆస్పత్రుల్లో సేవలు అందించాల్సిన వైద్యులకు స్పష్టమైన సంకేతం ఇచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు గైర్హాజరు కావడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. డీఎంఈ, డీఎస్‌హెచ్‌ఎస్ అధికారులు సమర్పించిన సమగ్ర నివేదికలను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రజారోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించదని స్పష్టం చేసింది. ఆసుపత్రుల్లో వైద్యులు సకాలంలో హాజరు కాకపోతే రోగులకు సేవలు అందడం ఆలస్యమవుతుంది. ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడే పేద ప్రజలు ఎక్కువగా నష్టపోతారు.ఈ చర్యల వల్ల ఇతర వైద్యులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించేలా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంది.

చెన్నై- న్యూ ఢిల్లీ రూట్లో బల్లార్షా- గూడూరు నాలుగో రైల్వే లైన్ పై కేంద్రం శుభవార్త!
చెన్నై- న్యూ ఢిల్లీ రూట్లో బల్లార్షా- గూడూరు నాలుగో రైల్వే లైన్ పై కేంద్రం శుభవార్త!

వైద్య సేవల నాణ్యత పెరగాలని, రోగులకు సకాలంలో చికిత్స అందాలని లక్ష్యంగా పెట్టుకుంది. అధికారులు ఇప్పటికే గైర్హాజరు వైద్యుల జాబితాను సమీక్షించి తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వైద్య రంగంలో క్రమశిక్షణ పెంచుతుందని భావిస్తున్నారు. రోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చర్యలు కొనసాగించాలని, వైద్యులు సకాలంలో ఆస్పత్రులకు వచ్చి సేవలు అందించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+