సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. ఆ భూములన్నీ పేదలకు పంచే ఆలోచన!

తెలంగాణలో సీలింగ్ భూముల వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. పరిమితికి మించి ఉన్న భూములపై ప్రభుత్వం దృష్టి సారించడంతో భూయజమానుల్లో ఉత్కంఠ నెలకొంది. పాత రికార్డులు, ప్రస్తుత భూ వివరాలను పోల్చి చూస్తే భారీగా మిగులు భూములు వెలుగులోకి రావచ్చని అంచనా.

సీలింగ్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి, పరిమితికి మించిన భూములను గుర్తించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సీలింగ్ చట్టం అమల్లోనే ఉందని, పరిమితికి మించి భూములు ఉంటే స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. చట్టం రద్దయిందనే ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, రాష్ట్రంలో 2,09,833 మంది సీలింగ్ చట్టం కింద తమ భూములను డిక్లేర్ చేశారు.

Telangana ceiling lands CM Revanth govt Plan to distribute all lands exceeding the ceiling limit to the poor

దీని ద్వారా 4,42,624 ఎకరాలు ప్రభుత్వానికి సమకూరాయి. అయితే ఇందులో ఎంత భూమిని పేదలకు పంపిణీ చేశారు, ఎంత భూమిని ఇళ్ల స్థలాల కోసం రెగ్యులరైజ్ చేశారు అనే పూర్తి లెక్కలు ఇంకా స్పష్టంగా లేవు. ప్రస్తుతం పాత రికార్డులను పరిశీలించి సీలింగ్, ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, ఇనాం, భూదాన్ వంటి భూములను గుర్తించే పని జరుగుతోంది. కంపెనీల పేర్లతో పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసిన అంశం కూడా చర్చకు వస్తోంది.

54 ఎకరాలకు మించి భూమి కొనుగోలు చేసే సంస్థలు నిర్దిష్ట నిబంధనలు పాటించాలి. అనుమతులు తీసుకోవడం, భూమిని నాన్-అగ్రికల్చరల్ వినియోగానికి మార్చడం తప్పనిసరి. పరిమితికి మించిన భూమిని మిగులు భూమిగా పరిగణించి ప్రభుత్వానికి అప్పగించాలి. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని భూమిలేని పేదలు, దళితులు, గిరిజనులకు వ్యవసాయం లేదా నివాస అవసరాల కోసం పంపిణీ చేసే అవకాశం ఉంది.

సీలింగ్ పరిమితికి మించిన భూమిని విక్రయించడం, గిఫ్ట్ ఇవ్వడం లేదా మార్పిడి చేయడం చట్టపరంగా చెల్లదు. ఇలాంటి లావాదేవీలపై సెక్షన్ 17 కింద నిబంధనలు వర్తిస్తాయి. మిగులు భూముల వివరాలను దాచిపెట్టడం లేదా ప్రభుత్వానికి అప్పగించకపోవడం వంటి ఉల్లంఘనలకు సెక్షన్ 23 కింద చర్యలు తీసుకోవచ్చు. రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం కూడా ఉంది.

సర్ విచారణ మీ ఇంటి వద్దకే... ఓటర్లకు బిగ్ రిలీఫ్!
సర్ విచారణ మీ ఇంటి వద్దకే... ఓటర్లకు బిగ్ రిలీఫ్!

పాత భూ రికార్డులు, ప్రస్తుత వివరాలను అనుసంధానించి మిగులు భూములను గుర్తించే ప్రక్రియ మొదలైతే సీలింగ్ భూములపై మరింత స్పష్టత వస్తుంది. దీంతో భూయజమానులు, రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+