ముంబై కదులుతోంది.. ! కాక్రోచ్ ల ధర్నాపై ఆదిత్య థాక్రే ట్వీట్ ..!
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఇవాళ ముంబై శివాజీ పార్క్ వద్ద ప్రారంభించిన జైల్ భరో ఉద్యమానికి తొలిరోజే భారీ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఎక్స్ లో కాక్రోచ్ లకు మద్దతుగా ట్వీట్లు పెడుతున్నారు. అలాగే సీఈసీ రాజీనామా కోసం పోరాటాలు చేస్తున్న విపక్ష పార్టీలు కూడా వీరికి జత కలుస్తున్నాయి. ఇదే క్రమంలో ముంబైకి చెందిన శివసేన యూబీటీ వర్గం నేత ఆదిత్య థాక్రే (aditya thackeray) ఎక్స్ లో సంచలన ట్వీట్ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని తిరిగి సాధించేందుకు ముంబై కదులుతోంది!! అంటూ ఆదిత్య థాక్రే ట్వీట్ చేశారు. సీజేపీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపడానికి అందరూ ఇక్కడికి తరలివస్తారని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. బీజేపీ నియంతృత్వ పాలన మన ఓటు హక్కును, మన గొంతుకను లాగేసుకుందని, వాటినే మనం తిరిగి సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదని, ఇది దేశానికి సంబంధించిన విషయం! ఇది మన ప్రజాస్వామ్యం, మన ఓటు హక్కు మరియు మన రాజ్యాంగం గురించిన పోరాటం అని ఆదిత్య థాక్రే పేర్కొన్నారు. ద్రోహి జ్ఞానేష్ కచ్చితంగా పదవి నుంచి దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Mumbai showing up to reclaim democracy!!
— Aaditya Thackeray (@AUThackeray) October 2, 2026
I hope all are heading here to support this protest by the CJP!
The BJP’s despotic regime has snatched away our vote, our voice and that’s what we must reclaim!
This isn’t political, this is about the country! This about our… https://t.co/NcD4kptHq3
మరోవైపు ఎక్స్ లో పలువురు రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా ట్వీట్లు పెడుతున్నారు. ఎన్నికల్ని ఫార్స్ గా మర్చేసిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఇప్పటికైనా వైదొలగాలని డిమాండ్లు చేస్తున్నారు. ముంబైలో కాక్రోచ్ ల నిరసనతో పాటు డిల్లీ జంతర్ మంతర్ లోనూ విద్యార్ది సంఘాలు ప్రారంభించిన ఉద్యమానికి కూడా భారీ స్దాయిలో మద్దతు లబిస్తోంది. జంతర్ మంతర్ వద్ద ఇవాళ జరిగిన నిరసనల్లో ఆప్ నేత అతిషితో పాటు సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ వంటి వారు నేరుగా వచ్చి పాల్గొన్నారు. గతంలో జరిగిన తరహాలోనే ఢిల్లీ పోలీసులు రెచ్చిపోయి అరెస్టులు, లాఠీచార్జ్ లకు దిగారు. దీంతో ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణ పరిస్దితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications
