అయ్యో.. సల్మాన్ ఖాన్ ఏంటి ఇలా అయిపోయాడు..! ముంబై రోడ్లపై సైకిల్ తొక్కుతూ..!

బాలీవుడ్ బాద్ షా సల్మాన్ ఖాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించేవి. ఆయన సినిమా వస్తుందంటే ముఖ్యంగా బాలీవుడ్ లో పండగ వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆయన సరైన హిట్ పడి దాదాపు పదేళ్లు అవుతుంది. 2015 లో భజరంగీ బైజాన్, 2016 లో సుల్తాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని నమోదు చేశాయి. కానీ ఆ తర్వాత సల్మాన్ ఖాన్ చేసిన టూబ్ లైట్, టైగర్ జిందా హై, రేస్ 3, భారత్, దబాంగ్ 3, టైగర్ 3, సికందర్ చిత్రాలకు ఆశించినంత ఫలితాలు రాలేదు. దాంతో ఆయన కెరీర్ ఇప్పుడు క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కు హిట్టు అవసరం.

ప్రస్తుతం మాతృభూమి అనే సినిమా చేస్తున్నారు సల్మాన్ ఖాన్.. ఈ మూవీ భారత్- చైనా మధ్య జరిగిన గల్వాన్ లోయ ఘర్షణలను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు పాత్రను సల్మాన్ ఖాన్ పోషిస్తున్నారు. ఈ సినిమాను సల్మాన్ ఖాన్ నిర్మిస్తుండటం విశేషం. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్ట్ 14న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. మరి ఈ మూవీతోనైనా సల్మాన్ ఖాన్ కమ్ బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి. మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

SalmanKhan Rides Bicycle to Shooting Spot Hilarious Netizen Comments Go Massively Viral SalmanKhan

అయితే ఈ మూవీ షూటింగ్ నేపథ్యంలో తాజాగా సల్మాన్ ఖాన్ సైకిల్ తొక్కుతూ సెట్స్ లోకి వచ్చారు. ముంబై రోడ్లపై సైకిల్ తొక్కుతూ ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. సాధారణ ప్రజల మాదిరిగానే సల్మాన్ ఖాన్ జనాల మధ్యలో ఇలా సైకిల్ తొక్కుతూ రావడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ పడగానే అక్కడే ఆగి మరీ అందరినీ గమనిస్తూ చాలా ప్రశాంతంగా కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఫిట్ నెస్ అంటూ పెడుతుండగా.. మరికొందరు సినిమాలు లేక సైకిల్ ప్రయాణం చేస్తున్నారంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+