కళ్లు చెమర్చే నిజం: శిథిలాలు దాచిన ప్రాణం, 18 రోజుల మృత్యుంజయురాలు!

వెనెజువెలాలో సంభవించిన భారీ భూకంపం సృష్టించిన విలయంలో ఆ కుటుంబం కళ్లముందే కుప్పకూలిన భవనం.. ప్రాణాల కోసం అల్లాడుతున్న వందలాది మంది.. ఇలాంటి విషాదకర పరిస్థితుల్లో వెలుగు చూసిన ఒక అద్భుతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. కేవలం 18 రోజుల పసికందు మృత్యువు అంచు నుంచి ప్రాణాలతో బయటపడటం ఆ దేశ ప్రజల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది.

భూకంపం కారణంగా కుప్పకూలిన ఒక భవన శిథిలాల కింద అభం శుభం తెలియని ఆ 18 రోజుల పసిపాప చిక్కుకుపోయింది. గంటల తరబడి సాగిన శ్రమ తర్వాత, రెస్క్యూ టీమ్ సభ్యులు ఆ చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. శిథిలాల నుంచి పాపను బయటకు తీసి, అక్కడే వేచి చూస్తున్న తండ్రి చేతుల్లో పెట్టినప్పుడు జరిగిన దృశ్యం ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఆ తండ్రి తన బిడ్డను గుండెలకు హత్తుకుని కన్నీరు మున్నీరుగా విలపించగా, అక్కడ ఉన్నవారంతా భావోద్వేగంతో చప్పట్లు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

iracle in Venezuela 18-Day-Old Baby Rescued Alive From Earthquake Rubble Emotional Reunion With Dad
వామ్మో మళ్లీ భూకంపం, 920 మంది మృతి..
వామ్మో మళ్లీ భూకంపం, 920 మంది మృతి..

90 నిమిషాల వ్యవధిలో మరో అద్భుతం..

పాపను కాపాడిన 90 నిమిషాలకే, రెస్క్యూ టీమ్ సభ్యులు అదే శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న ఆ పసిపాప తల్లిని కూడా గుర్తించారు. ఆమెను కూడా సురక్షితంగా రక్షించడంతో, ఆ కుటుంబం మొత్తం మృత్యుంజయులుగా నిలిచారు. ఈ సంఘటన వెనెజువెలా విలయంలో అత్యంత స్ఫూర్తిదాయకమైన క్షణంగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ రెస్క్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, లక్షలాది మంది ప్రజలు రెస్క్యూ టీమ్ సభ్యుల సాహసానికి సలాం కొడుతున్నారు.

మరోసారి విశ్వబంధుగా భారత్.. 'ఆపరేషన్ అమిస్టాడ్‌’తో రంగంలోకి మోదీ
మరోసారి విశ్వబంధుగా భారత్.. 'ఆపరేషన్ అమిస్టాడ్‌’తో రంగంలోకి మోదీ

కొనసాగుతున్న సహాయక చర్యలు..

భారీ భూకంపాల వల్ల వెనెజువెలాలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది మంది రెస్క్యూ వర్కర్లు, వాలంటీర్లు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో తీరని వేదన మిగిలి ఉండగా, ఇలాంటి అద్భుతాలు ఆ దేశ ప్రజలకు ఒక చిన్న ఆశను, ధైర్యాన్ని ఇస్తున్నాయి. కుటుంబ సభ్యుల కోసం వేచి చూస్తున్న ప్రజలు, అధికారుల సహాయక చర్యల ద్వారా తమ వారు తిరిగి వస్తారని ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+