వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ. 3 లక్షలు సాయం.. త్వరలోనే ప్రారంభం..!
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మరో గుడ్ న్యూస్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరుసగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ వస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే త్వరలోనే నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించే విధంగా 'రాజీవ్ యువ వికాసం' పథకాన్ని పూర్తి చేయాలని ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. ఈ పథకాన్ని గతంలోనే ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత నుంచి అప్లికేషన్లు తీసుకుంది. అయితే చివరి నిమిషంలో రుణాలు విడుదల వాయిదా పడింది. అయితే తాజాగా ఈ పథకం మరోసారి తెరపైకి రావడంతో యువతలో ఆశలు మరోసారి చిగురించాయి. ఇక 2026-27 బడ్జెట్ లో 'రాజీవ్ యువ వికాసం' పథకానికి రూ. 6వేల కోట్లు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
ఇక తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం స్కీమ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటీల యువతకు వ్యాపారం ప్రారంభించడానికి ఆర్థిక సహాయం అందించేందుకు గతేడాది ప్రకటించిన పథకమే 'రాజీవ్ యువ వికాసం'.. ఈ పథకంలో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు రూ.50 వేల నుంచి గరిష్ఠంగా రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. దీనిలో బ్యాంకు రుణం కొంత, మిగిలింది వివిధ కార్పొరేషన్లు రాయితీగా అందిస్తాయి. రూ.50 వేల యూనిట్ కు కార్పొరేషన్ లు పూర్తి స్థాయిలో సహాయం అందిస్తాయి.

మరోవైపు ఈ పథకం ద్వారా సబ్సిడీని మూడు విభాగాల్లో అందిస్తున్నారు. మొదటి విభాగంలో రూ.1 లక్ష వరకు లోన్ తీసుకుంటే 70 శాతం సబ్సిడీ లభిస్తుంది. రూ.4 లక్షల వరకు లోన్ తీసుకుంటే 60 శాతం సబ్సిడీ లభిస్తుంది. ప్రధానంగా నిరుద్యోగ యువత, పేద కమ్యూనిటీల యువత లక్ష్యంగా ఈ రుణాలు మంజూరు చేసే విధంగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.












Click it and Unblock the Notifications