కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. 8 మంది చిన్నారులు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. లూసియానాలో గుర్తు తెలియని ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 1-14 ఏళ్ల వయసు ఉన్న 8 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా కాలమానం ప్రకారం ఈ ఘటన ఆదివారం ఉదయం 6 గంటలకు జరిగినట్లు స్పష్టం అవుతోంది. ఈ కాల్పుల్లో మరో ఇద్దరికి గాయాలయ్యాయని ష్రీవ్‌ పాన్ పోలీసులు వెల్లడించారు. నిందితుడు పోలీసుల కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో అధికారులు దర్వాప్తు చేస్తున్నారు.

అమెరికాలోని లూసియానాలో జరిగిన కాల్పుల ఘటనలో ఎనిమిది మంది చిన్నారులు మృతిచెందారు. ష్రెవ్‌ పోర్ట్‌ లో ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయని పోలీసు చీఫ్ వేన్ స్మిత్ తెలిపారు. మృతుల వయస్సు ఏడాది నుంచి 14 ఏళ్ల మధ్య ఉండగా.. మొత్తం పది మంది కాల్పుల్లో గాయపడినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ ఘటనపై ప్రస్తుతం అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అనుమానిత షూటర్‌ ను పోలీసులు కాల్చివేయగా.. మృతిచెందిన పిల్లల్లో కొందరు దుండగుడి బంధువులేనని స్మిత్ వెల్లడించారు. "ఇది చాలా ఘోరమైన ఘటన.. మనలో చాలా మంది గతంలో ఇలాంటిది చూసి ఉండరు" అని ఆయన పేర్కొన్నారు.

Louisiana Mass Shooting Leaves Eight Children Dead Unknown Gunman Fugitive After Brutal Violence

ఇక కేసు దర్యాప్తులో సహకరించాలని ష్రెవ్‌ పోర్ట్ పోలీసులు లూసియానా రాష్ట్ర పోలీసులను కోరారు. బోసియర్ సిటీలో జరిగిన ఛేదనలో ఏ పోలీసు అధికారికి గాయాలు కాలేదని రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన సమాచారం, ఫోటోలు, వీడియోలు ఉంటే తమ డిటెక్టివ్‌లకు అందించాలని వారు ప్రజలను అభ్యర్థించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+