టీచర్లు, లెక్చరర్లకూ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకం.. క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్!
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలలో చదువుకునే విద్యార్థులకు మాత్రమే కాక టీచర్లు, లెక్చరర్లకు కూడా శుభవార్త చెప్పింది. విద్యార్థుల పోషకాహార అభివృద్ధి కోసం ముఖ్యమైన నిర్ణయం తీసుకొని పాఠశాలలు, కళాశాలలలో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా క్యాబినెట్ సమావేశంలో ఈ పథకాల అమలుకు ఆమోదం తెలిపింది.
టీచర్లు, లెక్చరర్ లకు శుభవార్త
ఇదే సమయంలో టీచర్లకు, లెక్చరర్ లకు శుభవార్త చెప్పింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు పోషకాహారం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల విద్యార్థుల డ్రాపవుట్స్ తగ్గుతాయని, విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులలో పోషకాహార లోపాలను తగ్గించడం కోసం కూడా ఈ పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడుతోంది.

పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి దోహదం చేసే నిర్ణయం
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇది విద్యా సమానత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు, పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. కేబినెట్ నిర్ణయం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఈ పథకాలను అమలు చేయనున్నారు.
టీచర్లకు లెక్చరర్లకు ఉచితంగా బ్రేక్ఫాస్ట్ మరియు లంచ్
ఉదయం అల్పాహారంలో పాలు, పండ్లు, ధాన్యాల ఆధారిత ఆహారం అందించాలని, మధ్యాహ్న భోజనంలో సమతుల్యమైన పోషకాహారం ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమం అమలుకు అవసరమైన నిధులు కేటాయించడం, అవసరమైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటు విద్యార్థులకు మాత్రమే కాకుండా, టీచర్లకు లెక్చరర్లకు కూడా ఉచితంగా బ్రేక్ఫాస్ట్ మరియు లంచ్ అందించనున్నారు.
విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి నిర్ణయం
ఈ నిర్ణయం విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాలు, పిల్లల సంక్షేమ సంస్థల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి. తెలంగాణలో కూడా ఈ కార్యక్రమం సమర్థవంతంగా నడపడం ద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఎక్కువ సమయం విద్యాలయాలలో ఉండేలా నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులకు మాత్రమే కాకుండా ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు కూడా ఉపయోగపడుతుందని, పాఠశాలలు, కళాశాలలు సిబ్బందికి భోజన సౌకర్యం కల్పించడం వారు ఎక్కువ సమయం విద్యాలయాలలో కేటాయించడానికి దోహదం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.













Click it and Unblock the Notifications