ఖమేనీ అంత్యక్రియలకు కొడుకు మొజ్తబా ఖమేనీ ఆబ్సెంట్.. కారణం ఏంటి..?

ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల నేపథ్యంలో ఆ దేశంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మరణించిన తర్వాత ఇరాన్ కఠినమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకావడం లేదని సమాచారం. ఇజ్రాయెల్‌ తో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన వేళ, ఆయనకు కల్పించాల్సిన భద్రతపై అధికారులు హామీ ఇవ్వలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

భారత్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధిగా ఉన్న అయాతొల్లా హకీమ్ ఎలాహి ఇటీవల ఈ విషయాలను వెల్లడించారు. మొజ్తబా ఖమేనీ ప్రజల్లోకి రావాలని భావిస్తున్నప్పటికీ, ప్రస్తుత భద్రతా పరిస్థితుల దృష్ట్యా అది అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఖమేనీ మరణానంతరం ఇరాన్ అంతటా తీవ్ర విషాద ఛాయలు అలముకోగా, దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు సంతాప దినాలు ప్రకటిస్తూ అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

భారత్ దౌత్యం.. సల్మాన్ ఖుర్షీద్ పర్యటన

ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొనేందుకు భారత్ నుంచి కాంగ్రెస్ ప్రతినిధిగా కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ టెహ్రాన్‌కు బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాసిన సంతాప లేఖను ఆయన ఇరాన్ ప్రభుత్వానికి అందజేయనున్నారు. సంక్షోభ సమయాల్లో చిరకాల మిత్రదేశానికి సంఘీభావం ప్రకటించడం భారత్ కనీస కర్తవ్యమని ఖుర్షీద్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

గతంలో ఐక్యరాజ్యసమితి వేదికలపై కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్‌తో భారత్‌కు దౌత్యపరమైన సవాళ్లు ఎదురైనప్పుడు ఇరాన్ మనకు బాసటగా నిలిచిందని ఆయన గుర్తుచేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌లతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ, ఇరాన్ ఎన్నడూ భారత వైఖరిని తప్పుబట్టలేదని అన్నారు. అలాగే ఇటీవల జరిగిన ప్రాంతీయ వివాదాల సమయంలోనూ హోర్ముజ్ జలసంధి ద్వారా భారతీయ నౌకల రాకపోకలకు ఇరాన్ సహకరించిందని ఆయన ప్రస్తావించారు.

Khamenei Funeral Why Did Son Mojtaba Stay Away from Final Rites Khamenei funeral Mojtaba absent

దశాబ్దాల పాటు ఇరాన్‌ను నడిపించిన ఖమేనీ మరణం ఆ దేశ 47 ఏళ్ల చరిత్రలో అత్యంత కీలకమైన పరిణామంగా నిలిచింది. టెహ్రాన్, ఖోమ్, మషాద్ నగరాలతో పాటు ఇరాక్‌లోనూ ఆయనకు నివాళులర్పించేందుకు ఊరేగింపులు సాగుతున్నాయి. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతున్న ఈ పరిణామాలు రాబోయే కాలంలో ఇరాన్ అంతర్గత భద్రతతో పాటు అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలను సైతం ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+