బ్యాంకు ఉద్యోగుల సమ్మె వేళ ఖాతాదారులకు పోలీసుల కీలక సూచనలు...!!

దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపు ఇచ్చాయి. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె కొనసాగనుంది. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో ఈ సమ్మె జరగనుంది. దీంతో పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీలు) బ్రాంచ్‌ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఇదే అదనుగా సైబర్​ నేరగాళ్లు వేర్వేరు పేర్లతో మోసం చేసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు నిర్ణయించాయి. సమ్మె వేళ ఖాతాదారులకు బ్యాంకులకు కీలక సూచనలు చేసాయి. ప్రత్యామ్నాయ సేవల పైన ఫోకస్ చేస్తున్నారు. ఇదే అదనుగా కొందరు సైబర్ నేరగాళ్లు ఖాతాదారులకు మోసం చేసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కస్టమర్ల అవసరాలను గుర్తించి బ్యాంకు ప్రతినిధులమని నమ్మిస్తారని, ఆన్​లైన్​ ద్వారా వివిధ సేవలంది స్తామంటూ తప్పుడు ప్రకటనలు ఇస్తారని పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. ఖాతాదారులకు సందేశాలు.. ఫోన్ కాల్స్ ద్వారా మీ బ్యాంక్​ అకౌంట్​ తాత్కాలికంగా స్తంభించిందని చెబుతారని.. అప్​డేట్​ చేయకపోతే ఈరోజు నుంచి కార్డులు పని చేయవంటూ తొందరపెట్టి ఏటీఎం పిన్​, సీవీవీ వివరాలు లాగుతారని అలర్ట్ చేస్తున్నారు. ఫిర్యాదుల నిమిత్తం బ్యాంకు కస్టమర్​ కేర్​ నంబర్ల కోసం ఆన్​లైన్​లో వెతికి తెర మీద కనిపించే నంబర్​కు కాల్​ చేయవద్దని సూచిస్తున్నారు.

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌ పై TTD కీలక ప్రకటన, భారీ డిమాండ్ తో..!!
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌ పై TTD కీలక ప్రకటన, భారీ డిమాండ్ తో..!!
bank-strike-holidays-cyber-crime-wing-issues-key-guidelines-on-digital-transactions-here-the-deta

ఖాతాదారులకు కీలక సూచనలు

బ్యాంకు సేవలు అందుబాటులో లేని సమయంలో కస్టమర్లకు ఏదైనా అవసరం ఏర్పడితే వారు వినియోగించే డెబిట్​ కార్డ్, క్రెడిట్​ కార్డ్​, పాస్​ బుక్ పై ఉండే ఫోన్​ నంబర్లను సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు. నెట్ వర్క్ సమస్య వల్ల ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని.. ప్రత్యామ్నాయ లింకులతో లాగిన్​ అవ్వాలంటూ ఏపీకే ఫైళ్లు పంపించి మోసాలు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అత్యవసరంగా డబ్బు అవసరమనే కారణంతో రుణాల కోసం లోన్​ యాప్​ లను ఆశ్రయించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా కస్టమర్లు సైబర్ మొసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచన చేసారు. బ్యాంకు సిబ్బంది పేరుతో వచ్చే కాల్స్ పైన అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+