ఏవియేషన్ హబ్ గా ఏపీ.. రాష్ట్రంలోనే మొదటి ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏవియేషన్ హబ్ గా తీర్చి దిద్దటం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం వేదికగా ఆంధ్రప్రదేశ్‌లోనే తొలి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌గా ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీని కేంద్ర పౌరవిమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అధికారికంగా ప్రారంభించారు. రెండు శిక్షణ విమానాలను జెండా ఊపి ప్రారంభోత్సవం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు 2047 నాటికి దేశంలో 350 విమానాశ్రయాలు ఏర్పాటు చేసే దిశగా పని జరుగుతోందని చెప్పారు. శిక్షణ సంస్థలు, ఏవియేషన్ విశ్వవిద్యాలయాలు, అనుబంధ సంస్థలను కలిపి ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన రంగానికి అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టితో ఏపీని దేశానికి ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

AP Aviation hub Union minister Rammohan Naidu Launches Andhra s First Flight Training Academy

ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం పెరుగుతోందని, దేశ యువత ఆ అవకాశాలను అందిపుచ్చుకునేలా ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే కర్నూలులో రెండో ఎఫ్‌టీవో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని, ఆ తర్వాత కడప, రాజమహేంద్రవరంలో రెండేసి, భోగాపురంలో మరికొన్ని ఏర్పాటు కానున్నాయని వివరించారు.

దేశీయంగా తయారైన హన్స్ ఎన్‌జీ విమానాలపై ఏపీలో శిక్షణ ఇప్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని కూడా ఆయన చెప్పారు. భోగాపురంలో 139 ఎకరాల్లో ఏవియేషన్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతోందని, త్వరలో దేశవ్యాప్తంగా మరో 1,600 విమానాలు రానున్నాయని మంత్రి ప్రస్తావించారు. వచ్చే 15 ఏళ్లలో 25 వేల నుంచి 30 వేల మంది పైలట్లు అవసరమవుతారని యువతకు పిలుపునిచ్చారు. కర్నూలులో డీజీసీఏ, క్యూసీఐ ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు.

తుఫాన్ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకు సీఎం చంద్రబాబు బిగ్ రిలీఫ్!
తుఫాన్ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకు సీఎం చంద్రబాబు బిగ్ రిలీఫ్!

విమానయాన రంగంలోకి అడుగుపెట్టే విద్యార్థులు నాణ్యమైన శిక్షణ సంస్థలను ఎంచుకునేలా ఎఫ్‌టీవోలకు ర్యాంకులు ఇస్తున్నామని మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ర్యాంకింగ్ విధానం ప్రవేశపెట్టినప్పుడు ఒక్క సంస్థ మాత్రమే ఎ కేటగిరీ సాధించగా, ఆరు నెలల్లోనే ఒకటి ఏ ప్లస్, 13 సంస్థలు ఎ కేటగిరీని అందుకున్నాయని గర్వంగా తెలిపారు. ఈ అకాడమీ ప్రారంభంతో కర్నూలు యువతకు విమానయాన రంగంలో కొత్త ద్వారాలు తెరుచుకున్నాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+