రాజమౌళి.. 25 ఏళ్ల ఎపిక్ జర్నీ: ఫిల్మ్ ఇండస్ట్రీ టార్చ్ బేరర్

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. నేటితో ఆయన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి పాతికేళ్లు పూర్తయింది. 2001లో ఇదే సెప్టెంబర్ 27వ తేదీన ఈయన దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1 విడుదలైంది. టాలీవుడ్ దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. నేడు ఆస్కార్ వంటి గ్లోబల్ వేదికలపై భారతీయ సినిమా సత్తాను చాటే స్థాయికి ఎదిగారు. ఫిల్మ్ మేకింగ్‌లో ఓ బెంచ్ మార్క్ ను నెలకొల్పారు.

ప్రతి అడుగులోనూ విజయాల పరంపరను కొనసాగిస్తోన్నారు. ఓ రకంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి టార్చ్ బేరర్‌గా నిలిచారు. కెరీర్ ఆరంభంలో టీవీ సీరియల్స్ కు దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన రాజమౌళి.. ఆ తర్వాత వెండితెరపై తనదంటూ ముద్ర వేశారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నంబర్ 1 తో దర్శకుడిగా ప్రస్థానం మొదలుపెట్టారు. తొలి సినిమాతోనే ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా వచ్చిన సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు.. వంటి చిత్రాలు ఆయనలోని మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాయి.

Celebrating 25 Years of Rajamouli Cinematic Brilliance Journey Torchbearer of Excellence Filmmaking

కథలో భావోద్వేగాలను బలమైన పాత్రలతో జోడించి నడిపించే ఆయన ప్రత్యేక శైలి అప్పటి నుంచే ఆరంభమైంది. రాజమౌళి సాధారణ కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా.. తెలుగు చిత్రసీమకు నూతన సాంకేతికతను పరిచయం చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ వాడకంలో ప్రయోగాలు చేశారు. మగధీరతో టాలీవుడ్ లో ఫాంటసీ జానర్‌కు ఓ నూతన అర్థాన్ని ఇచ్చారు. ఓ ఈగను ప్రధాన పాత్రగా పెట్టి తీసిన ఈగ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాను రూపుదిద్దడం ఆయన సృజనాత్మకతకు అద్దం పట్టింది. కథాంశం ఏదైనా, పాత్రల మధ్య భావోద్వేగాలు బలంగా ఉండేలా చూడటం రాజమౌళి ప్రధాన బలం.

పండుగల ముంగిట పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్
పండుగల ముంగిట పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్

బాహుబలితో రాజమౌళి ఓ సంచలనమే సృష్టించారు. భారతీయ సినీ చరిత్ర గురించి బాహుబలికి ముందు.. బాహుబలికి తర్వాత అని చెప్పుకొనేలా చేశారు. సినిమాకు ప్రాంతీయ సరిహద్దులు లేవని నిరూపించారు. పాన్ ఇండియా ట్రెండ్‌కు ఆయన గట్టి పునాది వేశారు. బాహుబలి సిరీస్ సాధించిన వసూళ్లు, సృష్టించిన రికార్డులు భారతీయ చలనచిత్ర రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చాయి. టెక్నికల్ వాల్యూస్, క్యారెక్టరైజేషన్ పరంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. చైనా, జపాన్ వంటి అనేక దేశాల్లో అక్కడి భాషల్లో విడుదలైందీ ఫిల్మ్.

అభయమిదే మిత్రమా: ఐక్యరాజ్యసమితిలో భారత్ కు బిగ్ బూస్ట్- తేల్చి చెప్పిన రష్యా
అభయమిదే మిత్రమా: ఐక్యరాజ్యసమితిలో భారత్ కు బిగ్ బూస్ట్- తేల్చి చెప్పిన రష్యా

దీని తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ తో తీసిన ఆర్ఆర్ఆర్ తో రాజమౌళి కీర్తి మరోసారి అంతర్జాతీయ స్థాయిని తాకింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుతో పాటు గోల్డెన్ గ్లోబ్ ను గెలుచుకుని ఆయన ప్రభంజనాన్ని ప్రపంచానికి చాటింది. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం రాజమౌళి మేకింగ్, విజువల్స్ వెనుక ఉన్న కష్టాన్ని చూసి ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు సినిమా సత్తాను అంతర్జాతీయ వేదికలపై మారుమోగేలా చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.

ఈ పాతికేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో రాజమౌళి ఒక్క పరాజయం కూడా లేని అజేయ దర్శకుడిగా కొనసాగుతున్నారు. స్టూడెంట్ నెంబర్ 1, ఛత్రపతి, సై, సింహాద్రి, ఈగ, యమదొంగ, విక్రమార్కుడు, మర్యాదరామన్న, మగధీ, బాహుబలి 1, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్.. ఇందులో ఏ ఒక్క ఫిల్మ్ స్టాండర్డ్ కూడా తగ్గలేదు. ఒక్కటీ ఫ్లాప్ కాలేదు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో యాక్షన్ అడ్వెంచర్ వారణాసి తీస్తోన్నారు. పాన్ వరల్డ్ మూవీ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+