జనసేనలోకి వైసీపీ మాజీ మంత్రి, అదే బాటలో ఆ ఇద్దరు..!?

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికల కోసం కూటమి - వైసీపీ నేతలు సమాయత్తం అవుతున్నారు. వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నుంచి నేతలు పెద్ద సంఖ్యలో జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా.. వైసీపీ మరో మాజీ మంత్రి జనసేనతో టచ్ లోకి వచ్చారు. అదే బాట లో మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం ఉన్నారని సమాచారం. ఈ పరిణామాలు రాజకీయంగా ఆసక్తిగా మారుతున్నాయి.

స్థానిక ఎన్నికల వేళ వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతోంది. గత రెండు, మూడు రోజుల్లోనే పలువురు జగన్‌ పార్టీ కీలక నేతలు జనసేనలో చేరారు. తుని నియోజక వర్గం నుంచి యనమల కృష్ణుడు, హిందూపురం నుంచి నవీన్‌ నిశ్చల్‌తో పాటు పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన వరుపుల సుబ్బారావు.. పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితోపాటు జిల్లా, మండల స్థాయి నేతలు కూడా జనసేన కండువా కప్పుకొన్నారు. వైసీపీ నుంచి జనసేనలోకి మరి కొందరు నేతలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కూటమిలో కీలకంగా ఉన్న జనసేన ఇప్పటి వరకు ఆచితూచి వ్యవహరించింది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడటంతో పాటు రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీ బలం పెంచుకునే ఆలోచనలో అధినాయకత్వం ఉంది. ఈ నేపథ్యంలో చేరికలకు గేట్లు తెరిచింది. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చేవారికి తొలి ప్రాధాన్యం ఇస్తోంది. అధినాయకత్వం చేరికలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో పలువురు వైసీపీ నేతలతో జనసేన ముఖ్య నేతలు మంత్రాంగం సాగిస్తున్నారు.

PM Kisan - అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం ఫిక్స్, ఖాతాల్లో రూ 6 వేలు..!!
PM Kisan - అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం ఫిక్స్, ఖాతాల్లో రూ 6 వేలు..!!
ycp-to-janasena-joinings-continue-as-key-leaders-switch-sides-pawan-moving-with-new-plans

త్వరలో మరన్ని చేరికలు

గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు మరి కొందరు జనసేనతో టచ్ లోకి వచ్చారని సమాచారం. వైసీపీ హయాంలో మంత్రిగా పని చేసిన ఓ కీలక నేతతో పాటు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జనసేన నాయకులతో టచ్‌లోకి వెళ్లారని తెలిసింది. పవన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే ఈ వారంలోనే వారు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వారితో పాటు స్థానిక నేతలు కూడా భారీగా పార్టీ మారతారని చెబుతున్నారు. మరోవైపు రాయలసీమలో బలమైన నాయకత్వం కోసం జనసేన చూస్తోంది. తిరుపతి మినహా మిగిలిన జిల్లాల్లో నాయకత్వ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని భర్తీ చేసేందుకు జనసేన పార్టీ చేరిక కమిటీ ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. రాయలసీమ నుంచి కొత్త వారిని.. అందులోనూ యువతను ప్రోత్సహించే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉంది. దీంతో.. వచ్చే వారం జనసేనలో మరి కొన్ని కీలక చేరికలు ఉండే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+