పాకిస్తాన్ (Pakistan)లో ఈ మధ్య తన సంచలన వ్యాఖ్యలతో కలకలం రేపుతున్న హోంమంత్రి మొహసిన్ నఖ్వీ (Mohsin Naqvi)..ఇవాళ మరో బాంబు పేల్చారు. దేశ పాలనా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని, చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం బయటపడిందని ఆయన వెల్లడించారు. దీంతో పాకి్స్తాన్ ప్రభుత్వంతో పాటు దేశంలోనూ అలజడి మొదలైంది. సైన్యానికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన మొహసిన్ నఖ్వీ ప్రకటనలు, ప్రధాని షెహబాజ్ షరీఫ్ వర్గంలో ఆందోళన పెంచుతున్నాయి.
భారత్ లో ఆ డబ్బుల పంపిణీ స్కీమ్ వద్దే వద్దు..! ఎందుకో చెప్పిన శ్రీధర్ వెంబూ..!
పాకిస్తాన్ లో న్యాయమూర్తులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, బ్యాంకర్లతో కూడిన పెద్ద వ్యవస్థ గత 21 ఏళ్లుగా లంచాలు తీసుకుంటూ ఈ భారీ స్కాం చేశారని నఖ్వీ ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే దీనికి సూత్రధారులైన నిందితుల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ ఆరోపణలు పాకిస్తాన్ అధికార పీఠంలో త్వరలోనే ఒక పెద్ద తిరుగుబాటు లేదా మార్పు జరగబోతోందనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. పాకిస్తాన్ సర్వ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్‌కు మొహసిన్ నఖ్వీ అత్యంత నమ్మకస్తుడు. దీంతో ఈ వ్యాఖ్యల వెనుక మునీర్ ఉన్నారన్న చర్చతో పాటు, ఈ పరిణామాలకు ప్రాధాన్యత పెరిగింది.
పాకిస్తాన్ లో పౌర ప్రభుత్వాన్ని పక్కనపెట్టి ఆర్మీ చీఫ్ మునీరర్ తన ప్రయోజనాల కోసం హోంమంత్రి నఖ్వీని ప్రత్యేక ప్రతినిధిగా వాడుకుంటున్నారనే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. నఖ్వీ కేవలం పాలనా వ్యవస్ధను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడమే ఇందుకు కారణం. దీనివల్ల ఆర్మీతో ఎలాంటి విభేదాలు రాకుండా చూసుకుంటూ, షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం ద్వారా సైనిక పాలనకు మార్గం సుగమం చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు నఖ్వీ వ్యాఖ్యలపై రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్రంగా స్పందించారు. ఆయన గత మూడేళ్లుగా అత్యంత శక్తివంతమైన పదవుల్లో కొనసాగుతున్నారని, కొన్ని విషయాల్లో ప్రధానమంత్రికి కూడా జవాబుదారీగా ఉండరని ఆరోపించారు. కేబినెట్, పార్లమెంట్ సమావేశాలకు కూడా సరిగ్గా హాజరుకాని నఖ్వీ, వ్యవస్థలో మార్పు తీసుకురావాలనుకుంటే ముందుగా తన సొంత పరిపాలనను, పాకిస్తాన్ క్రికెట్ బోర్డును సంస్కరించాలని సలహా ఇచ్చారు.US-Iran War: తీవ్రస్థాయికి అమెరికా-ఇరాన్ వార్..! సై అంటే సై..!