ప్రధాని మోదీ పాకిస్తాన్ వెళ్తారా: షెహబాజ్ షరీఫ్ నుంచి ఆహ్వానం- లైన్ క్లియర్?

భారత్- పాకిస్తాన్ దౌత్య సంబంధాల్లో అనూహ్య మలుపు చోటు చేసుకోబోతోందా?, అక్కడ జరగబోయే ఓ అత్యున్నత సమ్మిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారా?, దీనికి సంబంధించి ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నుంచి ఆహ్వానం అందిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ విషయాన్ని అటు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సైతం అధికారికంగా ప్రకటించింది.

ఇస్లామాబాద్‌ వేదికగా జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీని ఆహ్వానించనున్నట్లు పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. ఇస్లామాబాద్‌లో జరిగే ఈ ఉన్నత స్థాయి సమావేశానికి ఎస్సీఓలోని సభ్య దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులను ఆహ్వానించడం ఆతిథ్య దేశంగా తమ ప్రథమ బాధ్యతని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆయా దేశాల ప్రభుత్వ, దేశాధినేతల స్థాయి సమావేశం కావడం వల్ల ప్రోటోకాల్ పాటిస్తామని తేల్చి చెప్పింది.

Pakistan Reaffirms SCO Invitation Plan says No Exception for India PM Modi Will Get Official Call

ఎస్సీఓ సమ్మిట్ భేటీపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వివరాలను వెల్లడించారు. అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం సభ్యత్వ దేశాలన్నిటికీ సదస్సు కంటే ముందే అధికారిక ఆహ్వానాలు పంపాల్సి ఉందని పేర్కొన్నారు. దీనికి లోబడి ప్రధాని మోదీని సైతం ఆహ్వానం అందుతుందని వివరించారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో సభ్య దేశాల ప్రభుత్వాధినేతలు, అధ్యక్షులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తోన్నట్లు కూడా తెలిపారు.

చంద్రుడిపై హ్యూజ్ క్రాష్- ఇక ఉండేది 5 రోజులు మాత్రమే..!!
చంద్రుడిపై హ్యూజ్ క్రాష్- ఇక ఉండేది 5 రోజులు మాత్రమే..!!

యురేసియా రీజియన్ లో ఎస్సీఓ భేటీకి ప్రాధాన్యత ఉందని, ఈ భేటీ వల్ల సభ్య దేశాల మధ్య ప్రాంతీయ రక్షణ, ఆర్థిక, దౌత్య సంబంధాలు బలపడతాయని వ్యాఖ్యానించారు. ఈ భేటీకి ప్రధాని మోదీ స్వయంగా హాజరవుతారా, లేదా అనేది తేలాల్సి ఉందని, ఇది భారత్ తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉందని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. సభ్య దేశాధినేతలు హాజరవుతారని ఆశిస్తోన్నట్లు పేర్కొన్నారు.

బీజేపీలో బిగ్ వికెట్ అవుట్- జాతీయ స్థాయిలో ఎదురుదెబ్బ- సెగ?
బీజేపీలో బిగ్ వికెట్ అవుట్- జాతీయ స్థాయిలో ఎదురుదెబ్బ- సెగ?

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో భారత్‌, పాకిస్తాన్‌తో పాటు చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారస్ కలిపి మొత్తం 10 సభ్య దేశాలకు సభ్యత్వం ఉంది. యురేసియా రీజియన్ లో శాంతి, భద్రత, స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2001 జూన్ 15న బీజింగ్‌లో ఈ ఎస్సీఓ ఏర్పాటైంది.

బంగారం ధరలు రీబౌండ్- భయపెడుతున్న పరిణామాలు
బంగారం ధరలు రీబౌండ్- భయపెడుతున్న పరిణామాలు

ఎస్‌సీఓ సమాఖ్య అత్యున్నత నిర్ణాయక విభాగం కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్. దీని అధ్యక్ష పదవి ప్రతి సంవత్సరం ఆల్ఫాబెటికల్ క్రమంలో సభ్య దేశాల మధ్య మారుతూ వస్తుంటుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఈ శిఖరాగ్ర సదస్సు నిర్వహించే బాధ్యతలను పాకిస్తాన్ దక్కించుకుంది. భారత్- పాక్ మధ్య ద్వైపాక్షిక ఉద్రిక్తతలు ఎలా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ వేదికలకు సంబంధించి భారత్‌ను ఈ సమ్మిట్ కు ఆహ్వానించాల్సి ఉంటుందా దేశానికి. గతంలో ఈ సమావేశానికి భారత్ ఆతిథ్యాన్ని ఇచ్చింది. అప్పట్లో పాకిస్తాన్ విదేశాంగ ప్రతినిధులు దీనికి హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+