AP Survey 2026: ఏపీలో ఎవరెక్కడ ? స్థానిక పోరు వేళ తాజా సర్వే..! షాకింగ్ ఫలితాలు..!

ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో తాడోపేడో తేల్చుకునేందుకు అధికార కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు విపక్ష వైఎస్సార్సీపీ కూడా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు, మారిన పరిస్ధితుల్లో 175 నియోజకవర్గాల్లో ఎవరి బలం ఎలా ఉందన్న అంశాలపై చాణక్య స్ట్రాటజీస్ తాజా సర్వే (AP Survey 2026) నిర్వహించింది. ఇందులో పలు షాకింగ్ అంశాలు బయటపడ్డాయి.

దమ్ముంటే సచివాలయాలు రద్దు..! వైసీపీ సంచలన డిమాండ్..!
దమ్ముంటే సచివాలయాలు రద్దు..! వైసీపీ సంచలన డిమాండ్..!

చాణక్య స్ట్రాటజీస్ సర్వే (AP Survey 2026)

ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన తాజా సర్వే ఫలితాలు వెలువడ్డాయి. రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ సర్వేలో ప్రజాభిప్రాయం, ఓటర్ల అభిప్రాయాలు, స్థానిక రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్యేల పనితీరు వంటి అంశాలను అధ్యయనం చేసినట్లు సంస్థ తెలిపింది. అలాగే పార్టీల వారీగా ఓట్ల శాతం వివరాలను కూడా వెల్లడించింది.

AP Survey 2026 TDP Ahead of YSRCP in Vote Share Chanakya Strategies Report Says
Palle Panduga 3.0:
Palle Panduga 3.0:


టీడీపీకి 46.9 శాతం ఓటు షేర్

ఈ సర్వేలో వెల్లడించిన ప్రకారం టీడీపీ 46.9 శాతం ఓట్లతో ముందంజలో ఉంది. వైసీపీ 35 శాతం, జనసేన పార్టీ 9 శాతం, బీజేపీ 3.5 శాతం, ఇతరులకు 5.6 శాతం ఓటు షేర్ నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. ఈ డేటా మొత్తం 52,500 మందిపై నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా లెక్కించారు. ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు పేర్కొన్న పథకాల్లో స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఉద్యోగాల కల్పన, అన్నదాత సుఖీభవ, జాబ్ క్యాలెండర్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వంటి అంశాలను సర్వే నివేదిక ప్రస్తావించింది.

స్థానిక ఎమ్మెల్యేలపై అసంతృప్తి

రాష్ట్రస్థాయిలో చంద్రబాబు పాలనపై ప్రజల్లో నమ్మకం కొనసాగుతోందని పేర్కొంటూనే, పలువురు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులపై అసంతృప్తి ఉందని సర్వే తెలిపింది. కొందరు ప్రజాప్రతినిధులపై అవినీతి, ఇసుక, మట్టి, ఇతర వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, వాటి ద్వారా ఉద్యోగాలు కల్పించనున్నామని కూటమి నేతలు చెబుతున్నప్పటికీ, ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమల్లో ఎన్ని ప్రారంభమయ్యాయి, ఎప్పుడు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయనే విషయంలో ప్రజలకు మరింత స్పష్టత అవసరమని నివేదిక పేర్కొంది.

AP Survey 2026 TDP Ahead of YSRCP in Vote Share Chanakya Strategies Report Says

కడప, కర్నూలులో పెరిగిన వైసీపీ బలం

కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీ బలపడిందని సర్వే నివేదిక పేర్కొంది. కడప జిల్లాలో కమలాపురం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ వైపు ఓటర్ల మొగ్గు కనిపిస్తోందని నివేదిక చెబుతోంది. కర్నూలులోనూ కూటమి నేతల పనితీరు, క్యాడర్ అసంతృప్తి, టీడీపీ-జనసేన-బీజేపీ సమన్వయం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. ఈ సర్వేలో జిల్లాల వారీగా ఎమ్మెల్యేల ర్యాంకింగ్స్ కూడా ఇచ్చారు. రాష్ట్రస్థాయి జాబితాలో మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ మొదటి స్థానంలో, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెండో స్థానంలో, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ మూడో స్థానంలో, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నాలుగో స్థానంలో ఉన్నట్లు నివేదికలోని చార్ట్ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+