అన్‌ఎక్స్‌పెక్టెడ్..: తనయుడిని దింపిన వైసీపీ మాజీ ఎంపీ పరిమళ్ నత్వాని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ పరిమళ్ నత్వాని..ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తన తనయుడిని రాజకీయాల్లో దింపారు. దీనికోసం సమాజ్‌వాదీ పార్టీని ఎంచుకున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఆ పార్టీ అభ్యర్థిగా ఎంట్రీ ఇచ్చారు. ఎస్పీ అభ్యర్థిగా లక్నోలో కొద్దిసేపటి కిందటే నామినేషన్ పత్రాలు సైతం దాఖలు చేశారు.
ఆయనే.. ధన్‌రాజ్ పరిమళ్ నత్వాని. జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన పరిమళ్ నత్వాని తనయుడు. ఉత్తరప్రదేశ్ నుంచి ఖాళీ అవుతోన్న రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆయనను నామినేట్ చేశారు. మరో స్థానానికి పార్టీ సీనియర్ నేత రామ్ గోపాల్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. కొద్దిసేపటి కిందటే వారిద్దరూ కూడా తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. లక్నోలో జరిగిన ఈ కార్యక్రమానికి అఖిలేష్ యాదవ్ స్వయంగా హాజరయ్యారు.

ఉత్తరప్రదేశ్‌లో 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో బీజేపీకి ఎనిమిది దక్కడం ఖాయమైంది. మిగిలిన రెండూ కూడా సమాజ్ వాది పార్టీకి దక్కుతాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ నుంచి అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా దీనికి తెరదించారు అఖిలేష్ యాదవ్. రాజ్యసభ స్థానాల ఎంపికలో సర్ ప్రైజ్ ఉండబోతోందని ఇదివరకే హింట్ ఇచ్చారు. దీనికి తగ్గట్టుగానే ధన్‌రాజ్ పరిమళ్ నథ్వానీని బరిలోకి దింపారు.
తండ్రిలాగే ధన్‌రాజ్ కూడా పారిశ్రామికవేత్త. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్ ప్రెసిడెంట్ గా పని చేస్తోన్నారు. పరిమళ్ నత్వానీ.. జార్ఖండ్ నుంచి ఎన్డీఏ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. తండ్రి ఎన్డీఏలో ఉంటే, తనయుడు మాత్రం ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో పరిమిళ్ నత్వానీ వైఎస్ఆర్సీపీ తరఫున రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే.
सूचनार्थ
— Samajwadi Party (@samajwadiparty) September 30, 2026
समाजवादी पार्टी की ओर से राज्यसभा हेतु अधिकृत प्रत्याशी प्रो. राम गोपाल यादव जी एवं श्री धनराज परिमल नथवानी जी माननीय राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी की उपस्थिति में प्रातः 11 बजे अपना नामांकन पत्र दाखिल करेंगे।
1986 ఫిబ్రవరి 5న జన్మించారు ధన్‌రాజ్. లండన్‌లోని ప్రఖ్యాత రీజెంట్స్ బిజినెస్ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్‌లో డిగ్రీ పూర్తి చదివారు. అనంతరం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి కార్పొరేట్ లా, పబ్లిక్ రిలేషన్స్ విభాగాల్లో ఎంబీఏ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రెసిడెంట్ పని చేస్తోన్నారు. కార్పొరేట్ వ్యవహారాలు, ఫైనాన్స్, హెచ్ఆర్, సీఎస్ఆర్ వంటి విభాగాలను పర్యవేక్షిస్తోన్నారు. అలాగే.. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తోన్నారు.
#WATCH | Lucknow, UP: Samajwadi Party candidate for the Rajya Sabha elections and Director, Reliance New Energy Limited, Dhanraj Parimal Nathwani files his nomination papers in the presence of party president Akhilesh Yadav. pic.twitter.com/5o1uymizOm
— ANI (@ANI) September 30, 2026












Click it and Unblock the Notifications
