ఆధిపత్యానికి బ్రేక్.. HCU ఎన్నికల్లో ABVPకి బిగ్ ట్విస్ట్!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) విద్యార్థి యూనియన్ 2026 ఎన్నికల్లో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. లెఫ్ట్, దళిత, బహుజన విద్యార్థి సంఘాల విశాల కూటమి అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఘనవిజయం సాధించింది. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) నాయకురాలు దిల్షాదా రైహాన్ నూతన విద్యార్థి యూనియన్ అధ్యక్షురాలిగా ఎన్నికై సరికొత్త రికార్డు సృష్టించారు.

ఇంటర్ చదివే ఈ విద్యార్ధులకు స్కూటీలు - ప్రభుత్వం మార్గదర్శకాలు..!!
ఇంటర్ చదివే ఈ విద్యార్ధులకు స్కూటీలు - ప్రభుత్వం మార్గదర్శకాలు..!!

ఈ ఎన్నికల్లో దిల్షాదా రైహాన్ ఎస్ఎఫ్ఐ(SFI), ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ), అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఎస్ఏ), దళిత స్టూడెంట్స్ యూనియన్(డీఎస్‌యూ), ట్రైబల్ స్టూడెంట్స్ ఫోరమ్(టీఎస్ఎఫ్) కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త కూటమి తరఫున అధ్యక్ష బరిలో నిలిచారు. హోరాహోరీగా జరిగిన ఓట్ల లెక్కింపులో ఆమె తన సమీప ప్రత్యర్థి, అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)- సేవా లాల్ విద్యార్థి దళ్(ఎస్ఎల్వీడీ) కూటమి అభ్యర్థి నరేష్ పొడిశెట్టింపై ఘన విజయం సాధించి పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

HCU Elections 2026 SFI Leader Dilshada Raihan Wins HCU Student Union Presidential Election
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు వీళ్లే.. !!
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు వీళ్లే.. !!

గతేడాది(2025) జరిగిన హెచ్‌సీయూ ఎన్నికల్లో ఏబీవీపీ కూటమి ఆరు కీలక స్థానాలనూ దక్కించుకుని క్లీన్ స్వీప్ చేయగా.. ఈ సారి లెఫ్ట్-అంబేడ్కర్ వాద కూటమి తిరిగి యూనియన్ పీఠాన్ని దక్కించుకోవడం విశేషం. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత 2018-19 నాటి విజయ సరళిని గతేడాది రిపీట్ చేసిన ఏబీవీపీకి ఈ సారి ప్రగతిశీల విద్యార్థి సంఘాల కూటమి గట్టి పోటీ ఇచ్చి మళ్లీ క్యాంపస్ వర్సిటీ రాజకీయంలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+