ఇంటర్ చదివే ఈ విద్యార్ధులకు స్కూటీలు - ప్రభుత్వం మార్గదర్శకాలు..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు మూడు చక్రాల స్కూటీలను అందించాలని డిసైడ్ అయింది. ఇందు కోసం ఈ విద్యా సంవత్సరం 2026-27లో మొత్తం 1,000 మంది విద్యార్థులకు స్కూటీలు ఇచ్చేలా మార్గదర్శకాలు సిద్దం చేసింది. అవసరమైన ప్రణాళిక రూపొందించింది. ఈ పథకం కింద స్కూటీ లు పొందేందుకు అవసరమైన అర్హతలు.. విధి విధానాలను ప్రభుత్వం సిద్దం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు మూడు చక్రాల స్కూటీలను అందించాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం 2026-27లో మొత్తం 1,000 మంది విద్యార్థులకు స్కూటీలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. బస్సుల్లో ప్రయాణించే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో.. విద్యార్థుల రాకపోకలను సులభతరం చేసేందుకు స్కూటీలను అందించాలని ఇంటర్ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.10 కోట్లను కేటాయించింది. విద్యార్థులకు అందించే వాహనాలు రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ రూపంలో ఉంటాయి. ఇవి పెట్రోల్‌తో పాటు విద్యుత్తుతో కూడా నడిచే విధంగా ఉంటాయని అధికారులు వెల్లడించారు. కాగా, అర్హతలకు అనుగుణంగా లబ్ది దారులకు ఎంపిక చేసే విధంగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

ప్రభుత్వం మార్గదర్శకాలు
కాగా.. స్కూటీల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను మరి కొద్ది రోజుల్లో ప్రారంభించనున్నారు. వచ్చిన దరఖాస్తులను జిల్లా స్థాయి పరిశీలన కమిటీ పరిశీలిస్తుంది. అర్హత ప్రమాణాల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ప్రభుత్వం నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువగా దరఖాస్తులు వస్తే.. వైకల్యం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియలో దివ్యాంగుల సంక్షేమ శాఖ సహకారం తీసుకోనున్నారు. ప్రభుత్వం ఖరారు చేసిన స్కూటీల సౌకర్యం అందు బాటులోకి వస్తే మరింత మంది దివ్యాంగ విద్యార్థులు ఇంటర్ విద్యలో చేరే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తోంది.












Click it and Unblock the Notifications
