కేంద్రంలో వారితో పొత్తుకు జగన్ సిద్దంగా ఉన్నారు - సాయిరెడ్డి..!!
విజయ సాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. కొత్త పార్టీ ఏర్పాటు దిశగా పర్యటనలు చేస్తున్న విజయ సాయిరెడ్డి విశాఖ కేంద్రంగా అటు వైసీపీ.. ఇటు టీడీపీ లక్ష్యంగా పలు విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ కేంద్రంలో ఎవరితో పొత్తు పెట్టుకునేందుకు సిద్దంగా ఉన్నారో వివరించారు. రాజధానిగా అమరావతి విషయంలోనూ జగన్ ను టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి తన కొత్త పార్టీ ఏర్పాట్లు ముమ్మరం చేసారు. ఇందుకు సంబంధించి ఇటు కూటమి ప్రభుత్వం... జగన్ లక్ష్యంగా విమర్శలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలో జగన్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమితో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీతో చంద్రబాబు పొత్తు కొనసాగించాలని కోరుకుంటున్నారని.. ఇద్దరు నేతలు తమ వారసుల కోసమే ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. ఇద్దరూ రాష్ట్రం కసం పని చేయటం లేదన్నారు. కాగా.. అమరావతి పైనా కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతిని తాను వ్యతిరేకించడం లేదని.. రాజధానిని మార్చాలనుకోవడం అవివేకమని చెప్పుకొచ్చారు. అన్ని కులమతాల రాజధానిగా అమరావతిని నిర్మించాలన్నారు. ఉత్తరాంధ్ర రీజనల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

విశాఖ పైనా కీలక వ్యాఖ్యలు
కాగా, విశాఖను రాజధాని చేస్తామని వైసీపీ మాట తప్పిందని.. ఉత్తరాంధ్ర ప్రజలకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ యూటర్న్ తీసుకుని ఇప్పుడు మావిగన్ అంటున్నారని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయిన వెంటనే వైసీపీ మావిగన్ అంటూ మాయదారి మాటలు ఆడుతున్నారు. గిరిజన ప్రాంత హక్కుల కాపాడేందుకు మా పార్టీ ప్రయత్నిస్తోందని చెప్పారు. 1/70చట్టం.. జీవో నెంబర్ 3 సమగ్రంగా అమలు చేస్తామని సాయిరెడ్డి హామీ ఇచ్చారు. పేదరికంతో మతమార్పిడి గురైన వర్గాలను తిరిగి హిందువులు గా మారేందుకు కృషి చేస్తామని వివిరించారు. గిరిజనుల ఆర్ధిక వ్యవస్థ బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పుకొచ్చారు. వైజాగ్ అభివృద్ధి కి రెండు కుటుంబాలు చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర లో చెరకు కర్మాగారాలు మూసివేత కుట్ర చేసిందని విమర్శించారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక అమలు చేయాలని సాయిరెడ్డి డిమాండ్ చేసారు.













Click it and Unblock the Notifications
